జాతీయ విపత్తుగా ప్రకటించండి మోడీకి జయ లేఖ.!!

Edari Rama Krishna
గత నెల రోజులుగా చెన్నైలో కురిసిన వర్షానికి ఆ నగరం మహాసంద్రంలా మారిపోయింది.  దీంతో చెన్నై వాసుల పరిస్థితి అధ్వాన్నంగా మారిపోయింది. లక్షల మంది నిరాశ్రయులైనారు.. ఎంతమంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నా తక్కువే అవుతుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ, స్వచ్చంద సంస్థలు, రాజీకీయ నాయకులు, కార్యకర్తలు సేవాకార్యక్రమాలు ముమ్మరంగా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సైనిక బలగాలను రంగంలోకి దింపింది.

వదేండ్లలో ఎన్నడూ లేని విధంగా తమిళనాడును భారీగా ముంచెత్తిన వరద పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి జయలలిత విజ్ఞప్తి చేశారు.నగరంలోని అన్ని ప్రాంతాలు రోజుల పాటు వరద నీటిలో చిక్కుకుపోయాయి.ఇప్పటి వరకు మూతపడని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం సైతం రాకపోకలను నిలిపివేసింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ఇలా ఒక్కటేమీ యావత్ చెన్నై నగరం మొత్తం వరదనీటిలో చిక్కుకుపోయింది. చెన్నైకి కొన్ని రోజుల పాటు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ఈ సమయంలో ప్రధాని మోడీ చెన్నైలో ఏరియల్ సర్వే చేసి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు.

చెన్నైలో నీట మునిగిన ప్రజలు


తక్షణ సాయంగా వెయ్యి కోట్లు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల వల్ల దాదాపు 250 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆహారం, తాగునీరు, నిత్యావసర వస్తువులు దొరకక చెన్నై వాసులు అలమటించారు. మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. బుధవారం చెన్నై నగరంలో మరోసారి చిన్నపాటి వర్షం కురిసింది. అయితే వర్షం జనజీవనానికి, సహాయ చర్యలకు ఎలాంటి ఆటంకం కలిగించలేదు. చెన్నై వరద బాధితులకు సహాయమందించే కార్యక్రమంలో నటులు పార్తీపన్, ఆర్య, కార్తీతోపాటు పలు స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాలుపంచుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: