తెలుగు వారిపై బాలయ్య భలే కామెంట్ చేశాడు..!

Edari Rama Krishna
విభజన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడినా తెలుగు వారంతా ఒక్కటే అంటున్నారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. తెలుగు వారు ఖండాంతరాలు వ్యాపించి ఉన్నారని ఎక్కడ ఉన్నా మనమంతా ఒక్కటేనని ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు. హిందూపురంలో లేపాక్షి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్‌ను కలిశారు. లేపాక్షి ఉత్సవాలకు హాజరుకావాలంటూ అధికారిక ఆహ్వానపత్రాన్ని అందజేశారు.

అంతే కాదు  గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు, సీఎం కేసీఆర్ కి హృదయపూర్వక అభినందనలు కూడా తెలిపారు. ఏది ఏమైనా  రాజకీయాలకు అతీతంగా చాలా ఉంటాయని వాటిరి రాజకీయాలతో ముడి పెట్టకూడదని తెలుగు వారంత ఒక్కటిగా నిలిచి తెలుగు ఖ్యాతిని నిలబెట్టాలని అన్నారు. కేవలం రాష్ట్రాలు మాత్రమే వేరయ్యాయని తెలుగు భాష,సంస్కృతి వేరుకాలేదని అన్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే లేపాక్షి ఉత్సవాలకు తెలంగాణ తరపున మంత్రి చందూలాల్‌ని ఆహ్వానించినట్లు తెలిపారు.

అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఎందుకు ఆహ్వానించలేదనన్న మీడియా ప్రశ్నకు బదులుగా అలాంటిది ఏమీ లేదని పర్యాటక, దేవాదాయ శాఖల మంత్రుల్ని ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నామని అన్నారు. మరో వైను ఆహ్వానాన్ని మన్నించి ఉత్సవాలకు హాజరవుతానని చందూలాల్‌ చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: