తెరాస కి గట్టి దెబ్బ

KSK

లంగాణా రాష్ట్ర సర్కారు కి భలే షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నిక విషయం లో ఒక పక్క తెలంగాణా రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుక నిర్వహించాలి అనే ప్లాన్ ని ఈసీ తప్పు బట్టింది. ఒకరకంగా తీవ్ర ఆగ్రహం చూపించింది ఆ కమిటీ. ఖమ్మం జిల్లా కలక్టర్ ఎస్పీ లని ఇప్పటికిప్పుడే బదిలీ చేయాలి అని ఆదేశాలు ఒచ్చేసాయి. కొత్త కలక్టర్ తో పాటు ఎస్పీ ని కూడా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి .ఖమ్మ లో తెలంగాణా అధికార పక్షం నిర్వహిస్తూ ఉన్న ప్లీనరీ వివాదాస్పదం గా మారిన విషయం తెలిసిందే.



ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల అయిన తరవాత ఎన్నికల కోడ్ అమలులో ఉండగా తెరాస ప్లీనరీ ఎలా చేస్తుంది అని కాంగ్రెస్ ఈసీ కి వెళ్ళింది దీనికి తెరాస సమాధానం ఏంటంటే ఎప్పటి నుంచో ప్లీనరీ ఆలోచన ఉంది కానీ మధ్యలో ఎన్నికల నోటిఫికేషన్ రావడం తమకి సంబంధం లేదు అనేది వీరి ఆరోపణ.  అందుకు తగ్గ ఏర్పాట్లు ఉప ఎన్నిక నోటిపికేషన్ విడుదల కాకముందే చేస్తున్న నేపథ్యంలో తాము ప్లీనరీ జరుపుకోవటానికి వీలుగా అనుమతులు ఇవ్వాలంటూ అధికారుల్ని కోరటం.. వారు కొన్ని పరిమితులతో ఓకే చెప్పటం తెలిసిందే.ఈ పరిణామాల ని తీసుకుని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చెయ్యగా ఈసీ కేవలం గంటలో స్పందించడం గమనార్హం. ఖమ్మం కలక్టర్, ఎస్పీ ల ని వేటు వేసే వరకూ వెళ్ళింది పరిస్థితి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: