మీరు తెలివైన వాళ్లో కాదో చెప్పే సింపుల్ చిట్కా..!

Chakravarthi Kalyan
ఎవరికి వారు తామే పుడింగులమనుకుంటారు. ఇది వెరీ కామన్. కానీ తెలివితేటలను కూడా అంచనా వేసేందుకు శాస్త్రీయమైన పద్దతులు ఉన్నాయి. వాటి ప్రకారమే ఎవరు తెలివైనవారో.. ఎవరు కాదో నిర్ణయారు. ఇలా తెలివిని అంచనా వేసేందుకు ఐక్యూ, ఈక్యూ వంటి అనేకరకాలైన మానసిక పరీక్షలు ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ శాస్త్రీయ బద్దంగా జరగాలి. 

కానీ ఇవేమీ లేకుండానే ఓ చిన్న ప్రశ్నతో మీరు తెలివైన వారో, కాదో ఇట్టే చెప్పేయవచ్చట. ఆ ప్రశ్నకూడా విచిత్రంగా తెలివితేటలకు సంబంధించింది కాకపోవడం మరో విశేషం. ఇంతకూ ఆ ప్రశ్నేంచో తెలుసా.. మీరు రోజూ ఆలస్యంగా నిద్రపోతారా.. తొందరగా నిద్రపోతారా.. ఈ ఒక్క ప్రశ్న మిమ్మల్ని తెలివైనవారో కాదో డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే తెలివైన వారు మిగిలిన వారితో పోల్చుకుంటే ఆలస్యంగా నిద్రపోతారట. 

తెలిసిందా.. మీరు తెలివైన వారో కాదో..



ఇతరులతో పోలిస్తే కొద్దిగా ఐక్యూ పవర్‌ ఎక్కువగా ఉన్నవారిలో ఇలా ఆలస్యంగా నిద్రపోయే కామన్‌ పాయింట్‌ ఉందట. ఐక్యూ పవర్‌ తక్కువగా ఉన్న వారితో పోల్చుకుంటే తెలివైన వారంతా రోజూ రాత్రి ఆలస్యంగా నిద్రపోతారట. ఈ విషయాన్ని ‘సైకాలజీ టుడే’ అనే మ్యాగజైన్‌ ప్రచురించింది.
నిద్ర వేళలకు, ఐక్యూ సగటుకు చాలా దగ్గర సంబంధముందని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఒక్క నిద్రతోనే కాదు..  అలాగే చంద్రుడికి, ఐక్యూకు కూడా సంబంధం ఉంటుందట. చంద్రుడు ఉన్నప్పుడు ఆలోచించేవారి ఆలోచనల్లో స్పష్టత ఉంటుందట. ఐక్యూ సగటు అనేది వారు ఎంత త్వరగా నిద్రపోతున్నారనేదాన్ని ప్రభావితం చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇంతకూ మీరు రోజూ ఆలస్యంగానే నిద్రపోతున్నారు కదా.. మాకు తెలుసులేండి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: