రేపిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాజ్ థాక్రే

Edari Rama Krishna
భారత దేశంలో ఈ మద్య  మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు హత్యలు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ వెలుగు చూస్తూనే ఉన్నాయి. చట్టాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కామాంధులు తమ పైశాచిక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. అభం శుభం తెలియని చిన్నారులపై కూడా సామూహిక అత్యాచారలకు పాల్పడుతున్నారు. తాజాగా  దేశంలో మైనర్ బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రే ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వారి కాళ్లు, చేతులు నరకాల్సిందేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో చిన్నారులు, మహిళలపై అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇస్లామిక్(షరియా) కఠిన చట్టాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మహారాష్ట్ర‌లోని అహ్మద్ నగర్ జిల్లా కోపర్ది గ్రామంలో జులై 13వ తేదీన 15ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనపై రాజ్‌థాక్రే ఇలా స్పందించారు. బాధిత బాలిక కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..భారత దేశంలో ఈ మద్య కాలంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. టెక్నాలజీ ముసుగులో యువత పెడదారి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పిల్లలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలంటే ప్రస్తుత చట్టాలను మార్చాల్సిన అవసరముందన్నారు. సంఘవ్యతిరేక శక్తులను అదుపు చేసేందుకు షరియా లాంటి కఠిన చట్టాలు అమలు అలాంటి దుర్మార్గులు సరైన బుద్ది చెప్పినట్లు అవుతుందని అన్నారు. ప్పు చేయాలంటే భయపడేలా చట్టాలు ఉండాలని అన్నారు. అంతేగాక, ఎస్సీ, ఎస్టీ చట్టాలను దుర్వినియోగం కాకుండా చూడాలని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: