స్పెష‌ల్ స్టోరీ: న‌యీం వెనుక టీఆర్ఎస్ నేతల‌ హస్తం?

DSP
తెలుగు రాష్ట్రాల‌తో పాటు, ఇత‌ర స‌మీప రాష్ట్రాల్లో త‌మ క్రూర సామ్ర‌జ్యాన్ని స్థాపించుకున్న గ్యాంగ్ స్టర్, భువ‌న‌గిరి ఖాజా నయీముద్దీన్ అలియాస్ న‌యీం వ్య‌వ‌హారం రోజుకో మలుపు తిరుగుతుంది.  ఈ నెల 8వ తేదీన షాద్ న‌గ‌ర్ శివారు మిలీనియం బ్లాక్ లో త‌న గెస్టు హౌస్ వ‌ద్ద గ్రేహౌండ్ పోలీసుల చేతిలో హ‌తమైన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం పోలీసుల విచార‌ణ స‌భ్య స‌మాజం విస్తూపోయే నిజాలు బ‌య‌ట‌పడుతున్నాయి. ప‌రిస్థితిని గ‌మ‌నించిన తెలంగాణ స‌ర్కార్ తీవ్ర‌స్థాయిలో స్పందించి... నయీం కేసు విచార‌ణ పై ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో విచారణ చేప‌ట్టిన సిట్ బృందం  నయీం సంబంధించిన అక్ర‌మ ఆస్థులు, అక్ర‌మ లావాదేవిల‌ను స్వాధీనం చేసుక్కున్నారు. 

ఎమ్మెల్సీ నేతి విద్యాసాగ‌ర్ పై కేసు న‌మోదు...!

అంతేకాకుండా... న‌యీం భార్య హ‌సీనాబెగం తో పాటు సోదరి స‌లీమా బేగం, బంధువు మ‌హ్మాద్ అబ్దుల్ మతీన్ అలియాస్ ఫిరోజ్ ఆయ‌న భార్య క‌లీమా బేగంతో పాటు, భువ‌నగిరి లో నయీం అనుచ‌రులు సుమారు 40 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, తాజాగా మ‌రో విస్తు పోయే నిజం బ‌య‌ట ప‌డింది. నయీం తో తెలంగాణ రాష్ట్ర స‌మితి( తెరాస‌) కి చెందిన ఓ కీల‌క నేత‌కు సంబంధం ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. న‌యీం సొంత జిల్లా న‌ల్గొండ కు చెందిన ఎమ్మెల్సీ నేతి విద్యాసాగ‌ర్ కు న‌యీం తో సంబంధాలు ఉన్న‌ట్లు భువ‌న‌గిరి టౌన్ పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదైంది. న‌యీం బెదిరింపులు, అక్ర‌మ దందాకు సంబంధించిన ఓ ఆడియో టేపు వెలుగులోకి వ‌చ్చింది. భువ‌న‌గిరి చెందిన వ్యాపార వేత్త‌, తెలంగాణ రైస్ మిల్ల‌ర్ ఆసోషియేష‌న్ ఆధ్య‌క్షుడు గంపా నాగేందర్ తో న‌యీం బెందిరింపుల‌కు పాలు ప‌డిన ఆడియో టేపు ను నాగేంద‌ర్ సిట్ కు అంద‌జేశారు.

ఆడియో టేప్ లో విద్యాసాగ‌ర్ పేరు ప్ర‌స్తావించిన న‌యీం...

అయితే న‌యీం సంబంధించిన ఈ టేపులో న‌యీం నోట ఎమ్మెల్సీ విద్యాసాగ‌ర్ పేరుతో పాటు మ‌రో కీల‌క అనుచ‌రుడుగా పేరున్న భువన‌గిరి మండ‌లం కూనురు గ్రామానికి చెందిన పాశం శ్రీను పేరు విన‌బ‌డింది. ఇదే విష‌యం పై నాగేంద‌ర్ సిట్ తెలిపాడు.  దీంతో ఎమ్మెల్సీ విద్యాసాగ‌ర్ పై భువ‌న‌గిరి పోలీసులు ఐపిసి 363, 346, 120(బి) సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన‌ట్టు సిట్ అధికారులు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు న‌యీం.. అత‌ని అనుచ‌రుల‌పై 39 కేసులు న‌మోదు చేశామ‌ని సిటు అధికారులు తెలిపారు. మ‌రో ప‌ది మంది అనుచ‌రుల‌తోపాటు భువ‌న‌గిరిలో క‌త్తుల జంగ‌య్య‌, పులి నాగ‌రాజు, గుర్రం శివ‌రాజుల‌ను  అరెస్టు చేసి విచారిస్తున్న‌ట్టు సిట్ పేర్కొంది. వీరు గ్యాంగ్ స్ట‌ర్ ముఖ్య అనుచ‌రుల్లో ఒక‌రైన పాశం శ్రీను అనుచురులు.

టీఆర్ఎస్ పై ఆరోప‌న‌లు ఖండించిన ఎమ్మెల్యేలు...

మ‌రోవైపు న‌ల్ల‌గొండ టీఆర్ఎస్ నాయ‌కులపై వ‌స్తున్న ఆరోప‌న‌లు ఆ పార్టీ మ‌నుగొడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి, న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగ‌తుర్తి ఎమ్మెల్యే గాదారి కిషోర్ లు తీవ్రంగా ఖండించారు. టీఆర్ఎస్ పార్టీ నాయ‌కుల‌పై వ‌స్తున్న ఆరోప‌న‌ల్లో వాస్త‌వం లేద‌ని తెలిపారు. ఎమ్మెల్సీ పై ఎఫ్ఐఆర్ న‌మోదైన మాత్ర‌నా దోషిగా వ‌క్రిక‌రించ‌డం స‌రైంది కాద‌ని వివ‌రించారు.ఇదీలా ఉంటే వాస్త‌వానికి టీఆర్ఎస్ పార్టీ నాయ‌కులంటే ఎక్కువ‌గా ఎమ్మెల్సీ క‌ర్నె ప్ర‌భాక‌ర్, మండలి ఉప చైర్మ‌న్ నేతి విద్యాసాగ‌ర్ పైనే ఆరోప‌న‌లు ఉన్నాయి. అయితే క‌ర్నె ప్ర‌భాక‌ర్ త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌న‌లపై మీడియా ముందుకు వ‌చ్చి వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు.  నాటి నుంచి క‌ర్నె ప్ర‌భాక‌ర్ పై ఆరోప‌న‌లు స‌ద్దుమణిగాయి. 

ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పై న‌ట్టికుమారు స్పంద‌న‌...

ఇదీలా ఉంటే తాజాగా సినీ నిర్మాత న‌ట్టికుమార్ సైతం నయీం దందాపై స్పందించారు. న‌యీం గ్యాంగ్ తో ఆంధ్ర మంత్రులు, పెద్ద పెద్ద సినీ నిర్మాత‌ల‌కు కూడా సంబంధాలు ఉన్నాయ‌ని తెలిపిన న‌ట్టికుమార్... న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన  ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆ ఎమ్మెల్సీ నాకు అత్యంత మిత్రుడని, ఆయ‌న నన్ను చాలా సార్లు న‌యీం విష‌యంలో స‌హ‌య స‌హ‌కారాలు అందించార‌ని తెలిపారు. గ‌త కొద్ది రోజుల క్రితం ఆరోప‌నలు ఎదురుకున్న క‌ర్నె ప్ర‌భాక‌ర్ రావ‌డం... తాజాగా నేతి విద్యాసాగ‌ర్ పై సిట్ ఏకంగా కేసునే న‌మోదు చేయ‌డం గ‌మ‌నిస్తే ....  టీఆర్ఎస్ నాయ‌కులు పై అనుమానం క‌ల‌గ‌క మాన‌దు. మ‌రి అధికార పార్టీ ఏర్పాటు చేసిన సిట్ ఏ విధ‌మైన నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాలి...! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: