పవన్ కల్యాణ్ ఇంత తెలివితక్కుగా ప్రవర్తించాడేమిటి? మరీ ఇంత అజ్ఞానా?

తమ అత్మీయులకు, సంబంధించిన వారికి అన్యాయం జరిగితే ఎవరైనా వెళ్లి వారిని పరామర్శిస్తారు. అలాగే నిన్న పవన్‌ కల్యాణ్‌ తిరుపతిలోని తన అభిమాని హత్యకు గురైన నేపథ్యంలో ఆయన వెళ్లి పరామర్శించారు. ఇలాంటి సందర్భాల్లో వారి కుటుంబానికి ధైర్యం లభించేలా కూడా సెలబ్రిటీలు మాట్లాడుతారు. వారికి న్యాయం జరిగేలా తమ వంతు ప్రయత్నం తాము చేస్తాం అని అంటారు. అయితే పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చిన తీరు మాత్రం అచ్చంగా కేంద్రప్రభుత్వం, మోదీ తన జేబులో ఉన్నట్లుగా భరోసాతో మాట్లాడినట్లు కనిపిస్తోందని జనం కామెంట్లు చేస్తున్నారు.

 

తిరుపతిలో మరణించిన వినోద్‌ రాయల్‌ కుటుంబాన్ని ఓదారుస్తూ, ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. అంతవరకు కరక్టే. కర్ణాటక ప్రభుత్వం కేసును పట్టించుకోకపోయినట్లయితే, తాను కేంద్రంతో మాట్లాడి తగు చర్యలు తీసుకునే విధంగా ఒత్తిడి తెస్తామని ఆయన అన్నారు. అంటే ఒక రకంగా కర్ణాటక సర్కారును బెదిరించారన్నమాట.





నిజానికి ఇది ఘర్షణ పర్యవసానంగా జరిగిన దుర్మరణం. పనిగట్టుకుని చేసిన హత్య కాదు. అయినా అక్కడి పోలీసులు ఆ పనిచూసుకుంటారు. పవన్‌ అంతవరకు మాట్లాడి ఉంటే సరిపోయేది. 'కర్నాటక ప్రభుత్వం పట్టించుకోకుంటే.. కేంద్రంతో చెప్తా' అనడం అంటే, ఏదో సిద్దరామయ్య సర్కారును బెదిరిస్తున్నట్లుగా ఉంది. అసలు సిద్ధరామయ్య తో పవన్ ఫోనులో మాట్లాడినా ఆయన కాదంటారా? అయినా అక్కద కర్ణాటక సిఎం గాని భారత ప్రధాని గాని చేసే దేముంది. ఏదైనా ప్రొసీజర్ ప్రకారం ఈ దురదృష్ట సంఘటన దరిమిలా సహాయం చేసే అవకాశాలు ఉన్నాయేమో పరిశీలిస్తారు. వీలైతే ఆర్ధిక సహాయం చేయవచ్చేమో? చంపబడ్డ వారిని బ్రతికించలేరు కదా! అయినా పవన్ ఏమి చేయగలడు.

 

అయినా పవన్‌ కల్యాణ్‌ కేంద్రంతో మాట్లాడేంత తెలివి తెగువ ఉంటే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సంబంధించి ఆయన స్థాయిలో మాట్లాడదగిన అంశాలు చాలా ఉన్నాయి, మొడీ సహాయం తో కనీసం ప్రత్యేక పాకేజీ అయినా తీసుకు రాగలిగే వాడు. రాష్ట్రములో తనకి, బిజెపి కి గొప్ప భవిష్యత్ కలిగించేవాడు. అనీ వున్న పండ్ల చెట్టు భారముతో వంగి ఉంటుంది. ఏఎమీలేని ఎండిపోయిన చెట్టు సాధారణ గాలికే గలగల మంటుంది"  బాధాకరమే అయినప్పటికీ. అభిమాని హత్య కేసు గురించి ఢిల్లీ నుంచి లాబీయింగ్‌ చేయాలా?  అని జనం ఆశ్చర్యపోతున్నారు. 


అయినా పవన్‌ కల్యాణ్‌ కేంద్రంతో మాట్లాడేంత తెలివి తెగువ ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి ఆయన స్థాయిలో మాట్లాడదగిన అంశాలు చాలా ఉన్నాయి, మోడీ సహాయం తో కనీసం ప్రత్యేక పాకేజీ అయినా తీసుకు రాగలిగే వాడు. రాష్ట్రములో తనకి, బిజెపి కి  గొప్ప భవిష్యత్ కలిగించేవాడు. "అనీ వున్న పండ్ల చెట్టు భారముతో వంగి ఉంటుంది. ఏమీ లేని ఎండిపోయిన చెట్టు సాధారణ గాలికే గలగల మంటుంది" అదీ పవన్ పరిస్థితి. ఆయన మాటలు విని ఆంధ్రులు అప్పుడైతే ఓట్లు వేశారు కాని ఇప్పుడు ప్రజల్లోకి వెళితే నా సామి రంగా....తదిగిణ..తోం ...అని తొమేస్తారు. ఇప్పటికైనా మోడీ తో మాత్లాడి ఏపి కి సహాయం చేయటానికి ప్రయత్నించినా కొంతలో కొంతైనా పరువుదక్కుతుంది.    బాధాకరమే అయినప్పటికీ. అభిమాని హత్య కేసు గురించి ఢిల్లీ నుంచి లాబీయింగ్‌ చేయాలా?  అని జనం ఆశ్చర్యపోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: