"సింధు" పెరే మరచి పోయిన మన ముఖ్యమంత్రి


తనదైన శైలిలో అద్భుత విన్యాసాలతో రియో-ఓలంపిక్స్ లో విజయవంతంగా షటిల్ బాడ్మింటన్ లో రజతపథకం గెలుచుకున్న పి వి సింధు పేరును ఆ ముఖ్యమంత్రి మరచిపోవటం చాల విచిత్రమైన విషయం. అదీ నజరానా కూడా ప్రకటించిన సిఎం గారు కూడా అయనే. ఇలాంటి ముఖ్యమంత్రులు కూడా ఉంటారా! మన ఖర్మ కాకపోతే ఇదేం దరిద్రం. ఇలాంటి వాళ్ళు చిత్రంగానే ఉంటారనుకోవాలి. సాక్షి మాలిక్ కు ఒలింపిక్స్ లో కాంస్య మెడల్ వచ్చిన సందర్భంగా ప్రభుత్వం తరపున సన్మానం చేశారు. రెండున్నర కోట్ల రూపాయల చెక్ ఇచ్చారు.ఇదంతా బాగానే ఉంది. 




కాని రజత పతకం సాదించిన సింధూ పూర్తి పేరు మర్చిపోయారో,ఏమో తెలియదు కాని,  సభలో ప్రసంగిస్తూ సింధూ అంటూ ఆమె పూర్తి పేరు గురించి పక్కవారిని అడిగి తెలుసుకున్నారు. తదుపరి ఆమె కర్నాటకకు చెందిన క్రీడాకారిణి అని ఆయన ప్రకటించారు. ఆమె  తెలుగమ్మాయి. హైదరాబాద్ కు చెందిన వ్యక్తి అన్న సంగతి తెలిసిందే. విశేషం ఏమిటంటే  సింధూకు ఏభై లక్షల రూపాయల అవార్డు ప్రకటించినా, ఆమె ఎక్కడివారో ముఖ్యమంత్రి ఏలా మర్చిపోయారో?  అంటూ మీడియాలో కదనం వచ్చింది.



ఆయన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్లాల్ ఖట్టర్. తన ప్రసంగంలో ప్రముఖ "షటిల్ బాడ్మింటన్ తార" పి.వి. సింధు పేరు, రాష్ట్రం గురించి చెప్పడం లో తడబడ్డారు. తనే ఆమెకు హర్యానా ప్రభుత్వం తరపున ఏభై లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. బహుశ మతిమరపో? మరేమో? సారు ఇప్పుడే సింధు పేరు - ఊరు పేరు మరవటం దురదృష్టకరం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: