పవన్ కళ్యాణ్ మైండ్-సెట్ ఎలావుంది?

పవన్ కళ్యాణ్ అసలు మైండ్-సెట్ ఎలావుంది.?  తానేమి చేద్ధామనుకుంటున్నారు?  ఆయన తీరు కుంబకర్ణుడి  తీరు తలపించేలా ఉంది  (ఆరునెలల నిద్ర, ఆరు నెలల తిండి తో కాలం గడిపేవాడు  తన అన్న రావణుడు కోరితే అతిభయానక యుద్ధం చేస్తూ ఆకలి తీర్చుకొని మరల నిద్రలోకి జారు కునేవారు)  అయితే మన పవన్ కూడా మూడ్ వచ్చినప్పుడు మాత్రమే రాజకీయాలు మాట్లాడతారు. లెకపోతే ఆ అలోచనే ఉండదు. ఆ మూడ్ కూడా ఎక్స్-ట్రీం గా ఉంటుంది. అయితే తన బాష లో మన ఎం. ఎల్.ఏ.లు, ఎం.పి ల్లా కాకుండా కొంత సభ్యత పాటించటం హర్షనీయం.

 

ఆయన ఎవరిని కేక లేస్తారు? ఆయన వలననే కదా రాష్ట్రములో తెలుగు దేశం - కేంద్రములో ఆ పార్టి మిత్రపక్షం (మన రాష్ట్రం వరకు) అధికారములోకి వచ్చాయి.  లేకుంటే ఈ టిడిపి గోదాట్లోనో, కృష్ణలోనో కలిసిపోయేది.  ఆ గెలుపూ  మొత్తం మీద  అతి స్వల్ప మార్జిన్ తోనే. లేకుంటే ప్రతిపక్షం అదే వైఎసార్సిపి అధికారం హస్తగతం చెసుకునేది.    “పెనం మీద కాలినా,  పొయ్యిమీద కాలినా తగలడట మే తెలుగు వాళ్ళకి రాసిపెట్టాడు ఆ భగవంతుడు”   ఎందుకంటే మరో ప్రత్యామ్నాయం ఏదీ లేదు. అందుకు మనం బాధపడ నవసరం లేదు. ఆయన,  ఆయన జనసేన రెండు సంవత్సరాల మూడునెలలు పత్తాలేరు   అందుకే  బాధ పడాలి.

 

ఇప్పటికీ అయన జనసేన తరపున అధికార ప్రతినిధులను జిల్లాల, ప్రాంతాల, ఆఖరికి రాష్ట్రాల ప్రాతిపదికన కూడా  నియమించలేదనీ తెలిపారు. ఇక జనసేన అనేది ఇంకా  "ఒక కలల పార్టీనే - అంటే ఉహలలోనే ఉందని అర్ధం"  అంటే ఆయనే జనసేన తరపున కాక వ్యక్తిగతంగా -  ఈ తెలుగు దేశం వైఫల్యాలను "కరక్టు" చేయాలి.  ప్రజలకు సంబందించినంత వరకు ఆ రెండు పార్టీల విజయాలకు కారణమైన "తన ప్రజా విశ్వాసాన్ని ఫణంగా పెట్టి" గెలిపించిన  పవన్ కు ప్రశ్నించే అధికారం పూర్తిగా ఉందని జనాభిప్రాయం.

 

కాకపోతే పవన్ కళ్యాణ్  ప్రజల తరపున టిడిపి-బిజెపి తమ వాగ్ధానాలను నిలబెట్టుకోక పోతే వారని కఠినంగా ప్రశ్నిస్తానని, తన జనసేన పుట్టింది ప్రశ్నించటానికే నని నొక్కి వక్కాణించారు. నిజం గా చెప్పాలంటే టిడిపి అధికారములోకి రావటానికి స్వల్ప మార్జిన్ తో నైనా  టిడిపి గెలిచిందానికి పవన్ కళ్యాణ్  మీద ప్రజలకున్న నమ్మకం.  ఎన్నికల ఉపన్యాసాల్లో పవన్ ప్రసంగాన్ని జనం హృదయ పూర్వకం గా ఆమోదించిన దరిమిలా - గెలిపించిన దరిమిలా- అటు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక ప్రతిపత్తి కొసం మోడీ ని నిగ్గదీసే అధికారం పవన్ కళ్యాణ్ కే ఉంది.



 


అలాగే సింగపూర్ బాబు (చంద్రబాబు) ప్రజాధనం వృధా చేసే పాలనను ప్రశ్నించాలి,  ఆ అవకాశం నిర్ధ్వంధంగా పవన్ కే ఉంది. అంతేకాదు అనేకమంది వృత్తి నిపుణులను, ప్రపంచానికి అందించిన భారత్ "మురికి వాడల నిర్మాణాలను" మాత్రమే నిర్మించ గలరన్న వాదనకు  బాబు తో జాతికి క్షమాపణ చెప్పించాలి. అలాగే "ఎస్.సీ., ఎస్.టీ., లు గా పుట్టాలని ఎవరూ అనుకోరు" అని బహిరంగం గానే అన్నదానికి మరోసారి జాతికి క్షమాపణ చెప్పించాల్సిన బాధ్యత పవన్-కళ్యాణ్ దే.

 

ఎందుకంటే టిడిపి అనే తద్దెనాన్ని మన నెత్తిన పెట్టినది పవనే.   అమరావతి  అనే పేరుతో రాజ్యాధికారాన్ని, శంకుస్థాపనల పేరుతో ప్రజాధనాన్ని  (ఒకే నిర్మాణానికి అనేక సార్లు చేయించిన తీరు వలన)  వేలకోట్ల రూపాయలు వృధా అయ్యాయని ప్రజలు భావిస్తున్నారు.

 


అంతేకాదు ప్రతిపక్షాన్ని తుదముట్టించిన తీరుచూస్తే అమరావతి పేరుతో ఆంధ్రాని అమ్మేసే ప్రణాళికా రచన ధారుణంగా జరిగిందని, స్విస్-చాలంజ్ లాంటి చట్ట వ్యతిరేఖ కార్యక్రమం,  నగర నిర్మాణ బాధ్యతను సింగపూర్...సింగపూర్ అంటూ అష్టోత్తర, శత-సహస్ర నామావళి జపించటములోనే తెలుస్తుంది. ఏమాత్రమూ పారదర్శకత లేని అమరావతికి సహాయం చేయటానికి మోడీ నాయకత్వములోని కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవటానికి కారణమనిపిస్తుంది. ఆయన కూడా "అడుసు తొక్కనేల-కాలు కడుగనేల" అనే క్రమంలో నిశ్చబ్ధంగా ఉండిఉంటారు. వైఎసార్ రొంపిలో ఇరుక్కున్న మంత్రులు, అధికారుల్లా ఇరుక్కోవటం కేంద్రానికి బహుశ ఇష్టం లేకపోవచ్చు. ఈ పెంట లో వేలు పెట్టక పోవటమే మంచిదను కొని ఉండొచ్చు.

 

రేపు నిజాలు బయట పడతాయని సి ఆర్ డి ఏ అధికారిని తప్పించటం, అనుకూలుణ్ణి ఆ స్థానములోకి తీసుకు రావటములోని నైతికత ఎప్పుడూ ప్రశ్నార్హమే.   సదావర్తి భూముల కుంబకోణంలో ఎకరాకి ఐదు కోట్లిస్తామన్న వారి సవాలుకు సమాదానం చెప్పక పోవటాన్ని ప్రశ్నించకూడదా?  జనం ప్రశ్నిస్తున్నా తన ఆశ్రితజన ప్రయోజనమే బాబుకు ముఖ్యమా? అని ప్రశ్నించడేం పవన్ -ఏమౌతుందీ దేశం?   ఓట్ కు నొట్ కేసులో సినిమా చూపించినా ఈ ప్రజాస్వామ్య వ్యతిరెఖిని బొక్కలో తోయించటానికి  సాక్ష్యాదారాలు-నిరూపణలు అవసరమా? అంటున్న ప్రజలకు పవన్ కళ్యాణ్ ఏమి సమాధానం చెపుతారు. రెండున్నర సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తు - ఒక్క సారి అధాటున నిద్రలేచి తిక్కగా ఉపన్యాసమిచ్చి వెళిపోవటం పవన్ కళ్యాణ్ కు తగదనీ, ఇంకోసారి ఇలాచేస్తే ఏదో పిచ్చోడో? తిక్కలోడో? వాగుతున్నారని జనం అనుకుంటారని ప్రజలు హేళన చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: