వారి కారణంగానే నా పై మీడియా ఫోకస్ తగ్గింది: రేవంత్ రెడ్డి...!!

Shyam Rao
తెలంగాణ టీడీపీ పార్టీలో అధికార పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపించే సత్తా ఉన్న నేత ఎవరంటే టక్కున వచ్చే సమాధానమే రేవంత్ రెడ్డి. ఆయన విమర్శలు ఎక్కు పెట్టారంటే ఎదుటి అభ్యర్థి ఏ పార్టీ వాడైనా సరే హడలి పోవాల్సిందే. ఎదుటి వ్యక్తి ఎంతటి వారైనా సరే ఆయన దృష్టిలో వారు ప్రజలకు అన్యాయం చేశారని అనిపిస్తే చాలు మీడియా సమావేశంలో ఆయన ఆ వ్యక్తిని కడిగిపారేస్తారు. అధికార పార్టీ నేతలకు బహిరంగ సవాల్ విసరడంలో దిట్టమైన నేత ఎవరంటే ముందుగా గుర్తుకు వచ్చేది కూడా రేవంత్ రెడ్డే.



రాజకీయాలను పక్కన పెడితే వ్యక్తిగతంగా రాజకీయ చతురత కలిగిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి కి మంచి పేరు ఉంది. ఆయన రాజకీయ విశ్లేషకుడు కూడా. ఎవర్ని ఎప్పుడూ ఏ సమయంలో ఏ విధంగా విమర్శించాలో ఆయనకి బాగా తెలుసు. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా విమర్శించిన నేత ఈయనే. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నే ఈయన ఎన్నో సార్లు మీడియా సాక్షిగా విమర్శించారు. 



అయితే వీటన్నింటినీ గమనిస్తున్న తెలంగాణ సర్కారు మంచి సమయం కోసం వేచి చూసింది. ఎమ్మెల్సీ ఎలక్షన్ల సమయంలో నామినేటెడ్ పోస్టుకు టీఆర్ఎస్ ఎమ్మేల్యే తో రేవంత్ రెడ్డి బేరసారాలు కొనసాగిస్తున్న సమయంలో రహస్యంగా టీఆర్ఎస్ ఎమ్మేల్యే ఈ సన్నివేశాన్ని అంతా చిత్రీకరించి ఈ విషయాన్ని కేసీఆర్ దగ్గరకు చేరవేస్తే రేవంత్ రెడ్డి, చంద్రబాబు ను బుక్ చేయాడానికి ఇదే మంచి సమయంగా భావించిన కేసీఆర్ ఈ విడియో లను మీడియా కు విడుదల జేయడంతో ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మేల్యే పై కేసులు బుక్ అయ్యాయి. 



ఈ విషయాన్నిజీర్ణించుకోలేకపోయిన రేవంత్ రెడ్డి అప్పటినుంచి అధికార పార్టీ నేత, ఎమ్మేల్యేలపై విమర్శలను గుప్పిస్తునే వస్తున్నారు. అయితే ఈయన అత్యుత్సాహాన్ని గమనిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఆయన ని మీడియా ఎక్కువగా ఫోకస్ చేయకుండా జాగ్రత్త పడుతుంది. ఈ విషయాన్ని గమనించిన రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కారణంగానే తన వార్తలు మీడియాలో తగ్గిపోతున్నాయని, తన వార్తలకు ఎక్కువ ప్రచారం లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తోందని టీటీడీపీ వర్కింగ్ ప్రెసెడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, తనను తిట్టినవారికి ఉద్యోగాలొస్తున్నాయని, పాతూరి సుధాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి ప్రమోషన్లు కూడా లభించాయని విమర్శించారు. మరో వ్యక్తికి ఇటీవల పీఆర్వోగా ఉద్యోగం కూడా వచ్చిందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: