చక్రవ్యూహంలో చంద్రబాబు..!

 

ఏసీబీ కోర్టు జారీచేసిన "మెమోపై మాత్రమే హైకోర్టు స్టే ఇచ్చింది"  తప్ప మొత్తం  విచారణపై ఎలాంటి స్టే లేదని. అందువల్ల తెలంగాణ ఏసీబీ తన కేసు విచారణను కొనసాగించుకోవచ్చని మంగళగిరి ఎమ్మెల్యే, ప్రతివాది అయిన మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి   న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కేసు పెండింగ్‌లోనే ఉంటుందని, కేసు విచారణకు ఎలాంటి ఆటంకాలు కలిగించలేదని మరో సీనియర్ న్యాయవాది అరుణ్‌కుమార్ తెలిపారు. హైకోర్టు ఇచ్చినది కేవలం మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనని ఆయన అన్నారు ఎనిమిది వారాలు మాత్రమే.

 

చంద్రబాబు ఎప్పటినుంచో మాయమాటలు చెబుతూనే ఉన్నారని, కేసు దాఖలు చేసేటప్పుడే తాము చంద్రబాబును స్టేకు వెళ్లొద్దని చెప్పామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. విచారణను ఎదుర్కోవాల్సిందిగా సవాలు చేశామన్నారు. విచారణలో నిర్దోషివని తేలితే ప్రజలందరికీ కడిగిన ముత్యానివే, నిప్పువే అని తెలుస్తుందని చెప్పామని ఆయన అన్నారు.

 

కానీ దోషిగా తేలితే భవిష్యత్తు తన దెబ్బతింటుందనే భయంతోనే చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారని ఆయన తెలిపారు. అసలు ఏసీబీని ఆశ్రయించడానికి తనకు అర్హత లేదని చంద్రబాబు తరఫు న్యాయవాది అన్నారని.  కానీ న్యాయస్థానం మాత్రం తనను అనర్హుడిగా ప్రకటించలేదు, ఆయనను శాశ్వతంగా ఈ కేసు నుంచి బయట పడేయలేదని గుర్తు చేశారు.  కేవలం “ఏసీబీ కోర్టు మెమోపై ఎనిమిది  వారాలు మాత్రమే స్టే ఇచ్చిందని”  అన్నారు.  

 

తాము సమర్పించిన సాక్ష్యాలు సరైనవేనని భావించడం వల్లే ఏసీబీ కోర్టు తెలంగాణ ఏసీబీని కేసు పునర్విచారణకు ఆదేశించిందని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి    గుర్తుచేశారు.  అంటే కేసులో పస సరుకు ఉందని-లేకుంటే హైకోర్ట్ మొత్తం విచారణపైనే స్టే ఇచ్చి ఉండేదన్నారు.

కాగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విచారణ ఎదుర్కోవడానికి చంద్రబాబు భయపడి హైకోర్టుకు వచ్చి విచారణకు అడ్డుకోవడానికే,  స్టే కి వచ్చారని అన్నారు. క్వాష్ పిటిషన్ లో రామకృష్ణరెడ్డికి అర్హత లేదని చంద్రబాబు వాదించారని, అందుకు హైకోర్టు అంగీకరించలేదని, అలాగే విచారణపై శాశ్వత స్టే ఇవ్వలేదని, ఎనిమిది వారాలు మాత్రమే ఇచ్చిందని , ఆ తర్వాత మళ్లీ విచారణ జరుగుతుందని అన్నారు.తాము హైకోర్టు ఆదేశాలపై రివ్యూ పిటిషన్ వేస్తామని, సుప్రింకోర్టుకు వెళతామని ఆయన తెలిపారు.

 

‘ఓటుకు నోటు ’ కేసులో తనపై ఏసీబీ విచారణ జరపరాదని హైకోర్టును ఆశ్రయించడం ద్వారా సీఎం చంద్రబాబు తాను తనను నిజాయతీ పరుడని, నిప్పునని ఋజువు చేసుకునే అవకాశాన్ని కోల్పోవటమేకాదు-తను నేరస్తుడనని ఒప్పుకున్నట్లే, తప్పు చేశానని సర్టిఫికెట్ ఇచ్చు కున్నట్లయిందని శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. పిటిషన్ వేశారంటేనే స్టీఫెన్‌సన్‌తో ఫోన్‌లో మాట్లాడిన స్వరం తనదేనని చంద్రబాబే నిర్ధారించుకున్నట్లయిందన్నారు. ఉమ్మారెడ్డి చెప్పారు .  చంద్రబాబు గురువారం హడావుడిగా లంచ్‌మోషన్‌ద్వారా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయడాన్నిబట్టి దీనిపై ఆయనెంతగా ఆందోళన చెందుతున్నారో అర్థమవుతోందన్నారు.  నేరస్తునిలోని నేరస్వభావం ఆయన కదలికలను బట్టే తెలుస్తుందని ప్రజలు అంటున్నారు.

 

ఈ కేసు సాంకేతికంగా నిలబడదని, చంద్రబాబు స్వరపరీక్షకోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపేటపుడు ఏసీబీ అనుమతి తీసుకోలేదని, అసలిది ఏసీబీ పరిధిలోకే రాదని, ఎన్నికల కమిషన్ పరిధిలోనిది కనుక ఏసీబీ విచారణను నిలిపేయాలని రెండురోజులుగా కొన్ని పత్రికల్లో లీకులొస్తున్నాయన్నారు. గతంలో కూడా చంద్రబాబు ఏ విచారణా జరక్కుండా కోర్టులకెళ్లి స్టేలు తెచ్చుకున్నారని ఉమ్మారెడ్డి అంటూ ఏలేరు కుంభకోణంలో ఏవిధంగానైతే విచారణ జరక్కుండా స్టే తెచ్చుకున్నారో, “ఓటుకు నోటు”   కేసులోనూ అలాగే సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ హైకోర్టుకు వెళ్లడం దురదృష్టకర మని అన్నారు.

హైకోర్ట్ ఇచ్చిన స్టే ఇచ్చిన ఎనిమిది వారాల సమయములో బాబు తప్పించుకునే అవకాశాలు వెతుక్కుంటారు. ఇప్పుడు రామ కృష్ణా రెడ్డి బాగా మెలుకువగా ఉండాలి. ప్రజలకు మాత్రం ఆంధ్రా చంద్రుని లీలలు పూర్తిగా అర్ధమయ్యాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: