అబద్ధాల పునాదులపై కే సి ఆర్ అధికార సౌధం:

అబద్ధాలే ఆ నలుగురి అధికార సిం-హాసనానికి సొఫానాలు. తెలంగాణా వస్తుంది. దాన్ని మనమే పాలించు కుందాం. పేదరికానికి వెనకబాటు తనానికి, నాయకత్వాన్నిచ్చిరాజకీయాధికారము ద్వారా మీరూ సామాజికన్ గా ముందు వరసకు చేరుకొవాలని దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేసి "బంగారు తెలంగాణా" న్ని నిర్మిస్తానన్న పెద్దమనిషి గద్దె నెక్కారు ఇచ్చిన మాటమరచి. అక్కడే తొలి అధికారిక  "తప్పు"టడుగు పడింది.


ఉద్యమ కాలం నాటి మాటలు వాటి లోని మాధుర్యం నేడు వెగటైంది. నాటి మాటల మాటున దాగిన “మనసు లోని మర్మం” అధికారం వచ్చిన తరవాత వెల్లువలా చెలియలి కట్టను దాటేసింది.

తెలంగాణా ఇస్తే “ఉద్యమ పార్టీ తెలంగాణా రాష్ట్ర సమితి” ని కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్న మాట ఇచ్చి  -తెలంగాణా ఇచ్చిన తరవాత కాంగ్రెస్ అధినేత ను ఆమె ఇంటి వద్దే సకుటుంబముగా కలసి పాదాలంటి “అన్నమాట” మరవనని చెప్పిన పెద్దమనిషి దారిలోనే వాగ్ధానం మరచి ఇచ్చిన మాటకు తిలోదకాలిచ్చినా - ఆ పెద్దమనిషి "తప్ప"టడుగు వేశారనుకున్నాం గాని ఇంత తప్పుటోడని అనుకోలేదని తెలంగాణా ప్రజావాహి ని ఇప్పుడు తలుస్తుంది.


ఉద్యమానికి ఊపిరులు ఊదిన “నమస్తే తెలంగాణా”  దాని స్వంతదారుడు లక్ష్మీరాజం గారి ఊపిరితో ఉండాలంటే అని అన్నంతగా బెదిరించి ఆ “ఉద్యమ పత్రిక”ను స్వంతం చేసుకుని దాన్ని రాజకీయ ప్రత్యర్ధులను "బ్లాక్-మెయిల్" చేయటానికి పరికరంగా వాడుతున్నారు. ఉద్యమం లో అమరులైన వేలాది ఉద్యమవీరుల సాక్షిగా బంగారు తెలంగాణాకు తిలోదకాలిచ్చి “బంగారు కుటుంబం” ను అంగరంగ వైభవంగా నిర్మించు కుంటున్నారు. నమస్తే తెలంగాణా కేసిఆర్ స్వంతమైన తీరు కోసం ఈ లింకును ఫాలో అవ్వండి.


https://www.deccanchronicle.com/140628/nation-politics/article/c-l-rajam-quits-namaste-telangana-hands-over-reins-kcr%E2%80%99s-aide


మాట నిలుపుకోవటం మా ఇంటావంటా లేదన్నట్లు, చంద్రబాబు అనే అవినీతిపరుణ్ణి కోట్లాది జనాలముందే "ఓట్ కు నోట్" కేసు లో అధికారికంగా  బుక్ చేయించి  ఒక దశాబ్ధం పాటు హైదరాబాద్ నగరాన్ని సం-యుక్త రాజధానిగా పంచు కోవలసిన దాయాదిని ఆది లోనే హైదరాబాద్ నుండి పారిపోయేలా చేసి - తరిమేసినప్పటి నుండే అదికారం పదిలం చేసుకోవటం మొదలెట్టి తనలోని అధికారమధాన్ని తట్టిలేపారు. అధికారం పాదాల చెంత ఉంచుకుంటే మంచిదే,  కాని తలకెక్కించు కున్న దానికి మదం తోడైతే ఏం జరగాలో అదే జరుగుతుంది తెలంగాణాలో ఇప్పుడు. తలకెక్కి తైతెక్కలాడుతుంది, కోతికి అమాంతం దొరికిన కొబ్బరిచిప్పలా, ఎంచేసు కోవా లో? ఎలా తినాలో? తెలియక.


అధికారం నిలబెట్టుకోవటనికి అత్యంత అలవికాని వాగ్ధానాల వర్షం కురిపించారు. హైదరాబాద్ నగరాన్ని డల్లాస్ నగరం స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరం నరకలోకాన్ని మరపిస్తుంది. తండ్రి కొడుకులు ఇద్దరూ ఆడిన అబద్ధమిది. కరీం-నగర్ ను న్యూయార్క్ స్థాయికి అభివృద్ధి చేస్తామన్నారు కెసిఆర్. మనసుపై పట్టుకోల్పోయి సోయి లేకుండా నాలుక మాట యిచ్చిందని జనానికి చెప్పి మెప్పించగలడీ మాటల మాంత్రికుడు.


ఉద్యమ సమయములో కెసిఆర్ సెప్టెంబర్ 17 ను తెలంగాణా విమోచన దినం గా జరపాలని కాంగ్రెస్ పై వత్తిడి తెచ్చారు అంతేకాదు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక సెప్టెంబర్ 17 ను తెలంగాణా విమోచనదినంగా ప్రభుత్వపరం గా ప్రకటించి  నిర్వహిస్తా మన్నారు. కాని తెలంగాణా ఏర్పడి మూడు సంవత్సరాలైనా తెలంగాణా ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేదు.


సాగునీటి ప్రోజెక్టుల విషయములో కెసిఆర్ ఎంతో స్టడీ చేసినట్లు తరవాతనే అన్నీ డిజైన్స్ మార్చివేసినట్లు శాసనసభలో పవర్-పాయింట్ ప్రజంటేషణ్ లో చెప్పిందంతా అభద్దమేనని లబ్ధప్రతిష్టులైన ఇంజనీర్లు వాదిస్తున్నారు. మల్లన్న సాగర్ ఒక దురదృష్టకరమైన ప్రాజెక్టేనని విజ్ఞులు వాదిస్తూ, ఈ ప్రాజెక్ట్ స్వప్రయోజనాల సాధన కోసమేనని చెపుతున్నారు.


తారక రామారావు విదేశ పర్యటనలు ముగించి వచ్చి జూలై - ఆగస్టులో అనేక టెలివిజన్ లలో ప్రసారమైన హైదరాబాద్ రోడ్ల పరిస్థితిని కళ్ళారా వీక్షించి హైదరాబాద్ నగర పాలక సంస్థ అధికారులకు  కొన్ని అదేశాలిచ్చినా (అదంతా పెద్ద డ్రామా అంటున్నారు ఇప్పుడు కొందరు) వాళ్ళు వాటిని తుంగలోకి తొక్కేసి ఆయన్ని లక్ష్య పెట్టలేదని అందుకే హైదరాబాద్ నగరం కాస్తా హైదరాబాద్ నరకం గా మారిపోయిందని అనటమే కాదు ఆ నరకాన్ని ప్రస్తుతం అనుభవిస్తున్నాము కదా!


ఉద్యమ కాలంలో ప్రజలకిచ్చిన మాటలు నీటిమూటలేనని కెసిఆర్ కు సాధారణ రోజూ మనకు కనిపించే రాజకీయనాకులకు ఏమాత్రమూ తేడా లేదని జనాభిప్రాయం. శాసనసభాపతి మధుసూధనాచారిని కలుపుకొని ప్రతిపక్ష నిర్మూలనా కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. ఈ విషయములో చంద్రబాబు నాయుడు దొరికిన దొంగ అని, కెసిఆర్ దొరకవలసిన దొంగ అంటారు. ఆయనకు టి న్యూస్ - నమస్తే తెలంగాణా వంటి తెలంగాణాలో లార్జెస్ట్ సెల్లింగ్ న్యూస్ పేపర్ చేతిలో ఉన్నంతవరకు లేదా 2019 ఎన్నికలవరకు ఢోకా అనేది ఉండదంటారు.


కేంద్రం ఇచ్చిన సహాయాన్ని కూడా ప్రతిపక్ష ఎం.ఎల్.ఏ లను కొనటానికే కెసిఆర్ ఖర్చు చేశారని అమిత్ షా ఒక బహిరంగ సభలో చెప్పారు. బతకమ్మ, పుష్కరాలు, పండుగలు, కుల, మత సంఘాల భవనాలకు, క్రీడా రాయబారులకు బహుమతులుగా ఇచ్చిన కోట్ల రూపాయల మొదలైన ధన దుబారా కు అంతూ-పంతూ లేకుండా పోయిందన్నారు.


ప్రజల పేరుతో తెలంగాణా అభివృద్దికి చేసిన ఒక లక్ష కోట్ల రూపాయల ఋణం మొత్తం ఏమైందో? ఎలా ఖర్చు చేశారో వివరించటం ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదంటున్నారు. పోనీ లక్ష కోట్ల రూపాయల అభివృద్ధి ఎక్కడా కలికానికి కూడా కనిపించదు. అన్నింటిని మించి తెలంగాణా ఎన్నికలప్పుడు కెసిఆర్ చేసిన వాగ్ధానా లు ఎన్నో పురాతత్వ శాత్రవేత్తలకు ఒప్పజెప్పినా వాటిని వెలికి తీసి మనకు వివరించలేరని జనాభి ప్రాయం.


అబద్ధాలడటములో దీంట్లో హరీషురావు కవితలు కూడా అఖండులేనని జనం చెపుతు న్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర తో గోదావరి ప్రోజెక్ట్స్ విషయమై చేసుకున్న ఒప్పందం తెలంగాణా భవిత కు ప్రమాదమేనని ఇరిగేషన్ సాంకెతిక నిపుణులే వాదిస్తున్నారు. ఉద్యమ కాలములోనే కవిత సంపాదించిన ఆస్తులు అంతస్తుల గురించి సినిమా రంగ ప్రముఖులు కథలు కథలు గా  ప్రైవేటు మీటింగులలో చెప్పుకుంటారు. అంతేకాదు అమ్మగారి లీలలు కొన్ని షాపుల సంస్థల ప్రారంబోత్సవాలలో చూడాలట. ఇప్పుడు ప్రారంబోత్సవాలకు ఎవరూ అమెగారిని పిలవట్లేదని జనాంతికం.  


ఇందుమూలంగా ఆయనకు, ఆ నలుగురికి రాజకీయ, ఆర్ధిక  ప్రయోజనాలే ముఖ్యమని అర్ధమౌతుంది. ప్రత్యేక ఉద్యమ కాలంలో తనకు మార్గదర్శి గా మారి మాహాభారతములో పార్థసారధిగా దారిచూపిన ప్రొఫెసర్ కోదండరాం గారిని తాను ముఖ్యమంత్రి అయినప్పుడు అపాయింట్మెంట్ అయినా ఇవ్వకుండా అవమానించిన తీరు గర్హనీయం. అలాగే ఉద్యమ వాగ్ధానాలను మనం కోరుకున్న తెలంగాణా ఇది కాదని ఆయన గుర్తు చెసినప్పుడు టిఆరెస్ ప్రజా ప్రతినిధులతో మంత్రులతో ఆయన పై దాడిచేయించినప్పుడు ప్రజల తిరస్కారం ఆయనకు చుక్కలు చూపించింది. అదే ఆయన రాజకీయ పతనానికి నాంది ప్రస్థావన పలికింది. బహుశ కొద్దిరోజుల్లోనే తిరస్కార ప్రభావ వీచికలు వెల్లువెత్తవచ్చు. ఈ అబద్ధాలపుట్ట పగులిపోనూ వచ్చంటున్నారు తెలంగాణా ప్రజానీకం.

ఈ ప్రజాస్వామ్య కాలంలోను రాచరిక పోకడలకు దొరతనపు అహంకారానికి ఉదాహరణ గా - కెసిఆర్ నగరములో లేనప్పుడు ఆయన మనుమడు కూడా సచివాలయాన్నికి వచ్చి ఉన్నతాధికారులను ఉరుకులు పెట్టిస్తాడని - ప్రతీతి. తీరిదే అయితే ప్రజలనుండి సవాళ్ళు మొదలౌతాయి. ఉదాహరణకు సుప్రీం కోర్ట్ ఇప్పటికే సభాపతికి సుతిమెత్తటి 90 రోజుల సమయమిస్తూ ఒక ఎన్నికైన సభ్యులు జంపింగ్ జపాంగ్ లను టిఆరెస్ లో ఎలా చెర్చుకున్నారు? లాంటి ప్రశ్నలు ఎన్నో? 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: