పాక్ గుండెల్లో రాయి - చైనా పాక్ కు సాయం చేయదట?

సాధారణ చైనా నైజం తమకు లాభం లేనిపని చేయబోదు. అలాగే తమ చిరకాల మిత్రుడు పాకిస్థాన్ తో సన్నిహిత సంబందాలు బాగా ఉంచు కోవటములో అశ్రద్ధ వహించక పోవచ్చు. అలాగే అమెరికా తో విరోధం తెచ్చుకుని తమ వ్యాపార, ఆర్ధిక బంధాలపై వత్తిడిని పెంచుకొనే అవకాలపై దృష్టి ఉంచుతుంది. అంతే కాదు అంతర్జాతీయ సంబందాల్లో ఒక ఉగ్రవాదదేశానికి సహకరించిందన్న అపనిందను తద్వారా తేడాగా మారే లావాదేవీలను 150 కోట్ల జనాభా ఉన్న చైనా అంత తేలికగా రిస్క్ చేస్తుందని అనుకోవటం కష్టమే అవుతుంది.


అమెరిక పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశమని ప్రకటన చేసిన అనంతరం పాక్-చైనా సంబందాలలో పెనుమార్పులు సంభవించినా ఆశ్చర్యం లేదు. చైనా పాక్ ను బహిరంగంగా సమర్దిస్తే ఇస్లామిక్ ఉగ్రవాదానికి ద్వారాలు తెరిచినట్లే అన్నది చైనా కు బాగా తెలుసు. కనిపించని ఉగ్రవాద ప్రమాదం చైనాలో కూడా వ్రేళ్ళునుకుందంటారు విశ్లేషకులు. 

పాక్ తో చైనా వ్యూహాత్మక మైత్రి ని ప్రశ్నించలేము. అలాగే చైనా భారత్ వ్యాపార పరిమాణం తక్కువేమీ కాదు. ఒక్కసారి భారత్ తో వాణిజ్యబందాలు తెగితే చైనా రుచిచూడనున్న ఆర్ధిక, వాణిజ్య  వాతావరణం దౌర్భాగ్య స్థితిలోకి తీసుకెళుతుంది. చైనా కున్న సుదూర వ్యూహాత్మక లక్ష్యాలకు ఆదిలోనే సంధి కొడుతుంది. 
 


భారతదేశంతో యుద్ధం వస్తే పాకిస్థాన్‌కు తాము సాయం చేస్తామంటూ తమ సీనియర్ దౌత్యవేత్త ఒకరు చెప్పిన విషయం తమకు తెలియదని చైనా స్పష్టం చేసింది. తద్వారా పాకిస్థాన్‌ కు సాయం చేసే విషయంలో వెనుకంజ వేసినట్లయింది. "వేరే దేశం ఏదైనా దాడి చేసిన పక్షంలో పాక్‌కు చైనా అండగా ఉంటుందని" పాకిస్థాన్‌లో చైనా రాయబారి 'యు బోరెన్‌' పేర్కొన్నట్టు పా‍కిస్థాన్‌​ పంజాబ్‌ ముఖ్యమంత్రి  కార్యాలయం చెప్పిన విషయం తెలిసిందే. 


దీనిపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కోరినప్పుడు చైనా విదేశాంగ శాఖ ఆ అంశాన్ని కొట్టిపారేసింది. అసలు ఆ విషయం గురించి తమకు ఏమాత్రం సమాచారం లేదని, విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి 'గెంగ్ షువాంగ్' చెప్పారు. భారత్ పాకిస్థాన్ రెండు దేశాలకూ పొరుగు దేశంగా, మిత్ర దేశంగా ఉన్నందున చైనా విధానం ఎప్పుడూ స్పష్టంగా ఉందని, వాటి మధ్య ఉన్న విభేదాలను చర్చల ద్వారా రెండు దేశాలు పరిష్కరించుకోవాలని ఆయన ఎప్పుడూ చెప్పే పాత పాటే పాడారు. 


కశ్మీర్ సమస్య చాలాకాలంగా ఉందని, దాన్ని కూడా సంబంధిత వ్యక్తులు శాంతియుతంగా కూర్చుని చర్చించుకోవాలని ఆయన తెలిపారు. ఇక చైనా భారత దేశాల మధ్య సరిహద్దుల ను సరిగా గుర్తించాల్సి ఉందని, దీనిపై వారితో చర్చలు కొనసాగిస్తున్నామని, ఈ విషయంలో ఉన్న విభేదాలను పరిష్కరించుకుంటామని కూడా గెంగ్ షువాంగ్ చెప్పారు. ఎల్.ఓ.సి.  విషయంలో ద్వైపాక్షిక ఒప్పందాలకు తమ సైన్యం పూర్తిగా కట్టుబడి ఉంటుందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: