తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ యువత ఆత్మబలిదానాలు చేసుకుంటున్నటువంటి ఈసందర్బంలో తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం సబబుకాదని, అందుకే తాను జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటానని టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ప్రకటన కేవలం ఉత్తుత్తి ప్రకటనగానే మిగిలిపోయింది.
జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఫ్యాషన్ గామారినటువంటి ఈ సందర్బంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 17న టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఓవైపు తెలంగాణ వాదులు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసుకుంటుండగా తాను సంబరాలు జరుపుకోవడం మంచి పద్దతి కాదని, అందుకే ఈసారి జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటానని కెసిఆర్ ప్రకటించారు. అయితే తాను మాత్రమే జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటానని అన్నాడు కాని అభిమానులను మాత్రం జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని చెప్పలేదనుకున్నారో తెలియదుగాని టిఆర్ఎస్ నాయకులు ఎగబడి కెసిఆర్ జన్మదిన వేడుకల ప్రకటనలు ఇచ్చుకున్నారు.
కాగా కెసిఆర్ ప్రకటన ఉత్తుత్తిది అనుకున్నారో లేదా కెసిఆర్ క్రింది స్థాయి నాయకులకు ఈ విషయం చేరవేయలేదా అనేది అందరి ముందున్నటువంటి ప్రశ్నలు. కెసిఆర్ జన్మదినం సందర్బంగా ఈరోజు ఏదినపత్రిక చూసిన కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలే. జన్మదిన వేడుకలు వద్దని కెసిఆర్ ప్రకటన ఓవైపు ఉండగా టిఆర్ఎస్ నాయకులు మాత్రం పోటీపడి ప్రకటనలు గుప్పించారు. కలర్ ఫుల్ బొమ్మలతో అందరికి కనిపిస్తున్నటువంటి జన్మదిన ప్రకటనలు ఎందుకిచ్చినట్లని అందరికి కలుగుతున్న అనుమానాలు. అంతేకాదు కొన్ని చానల్స్ మార్చినా అప్పుడప్పుడు కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షల ప్రకటనలే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఇకా కెసిఆర్ చానల్ గా ముద్రపడినటువంటి టీ చానల్ లో మాత్రం పోటీ పడి నాయకులు కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో కెసిఆర్ పుట్టిన రోజు నేడేనని అందరికి తెలిసిపోయింది. జన్మదిన వేడుకలంటే ఇంతకంటే ఇంకేమి ఉంటుందని కొందరి అనుమానం. స్వీట్లు పంచుకుంటేనే, కేక్ కట్ చేస్తేనే జన్మదిన వేడుకలని టిఆర్ఎస్ నాయకులు అనుకున్నారో తెలియదుగాని జన్మదిన ప్రకటనలు ఇచ్చుకున్నారు. అంటే ఇలా జన్మదిన వేడుకలను ప్రచారం చేస్తే అది ఉత్తుత్తి జన్మదినమని అనుకుంటారని భావించి అలా పోటీ పడి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో కూడా టిఆర్ఎస్ నాయకులు జిమ్మిక్కులు ప్రదర్శించారన్నమాట!?
మరింత సమాచారం తెలుసుకోండి: