కేంద్ర నిఘా వ్యవస్థ స్కానర్ లో తెలుగుదేశం టిడిపి ఎం.ఎల్.ఏ

తెలుగు దేశం ఎం.ఎల్.ఏ ల తీరు స్మగ్లర్లకు, ఎర్రచందనం దొంగలకు, మాఫియాగాళ్ళకు పోలి ఉంటుందని ప్రజలు వాపోతున్నారు. గతములో ఇసుక మాఫియా డాంగా చరిత్రకెక్కిన చింతమనేని ప్రభాకర్ దయదాక్షిన్యాలు, సంస్కారం లేకుండా స్త్రీ అని చూడకుండా రెవెన్యూ అధికారిణిపై దౌర్జన్యం చేయటం తామింకా మరవలేదని ఆ కోవలోకే వచ్చి దురాగతాలు చేసిన కేసినేని నాని, బుద్దా వెంకన్నలే కాకుండా ఇప్పుడు వెంకటగిరి ఎమ్మెల్యే  కరుగొండ్ల రామకృష్ణ  వ్యవహారం తో అసలు మనం ఎన్ను కున్నది పాలకులనా దోపిడీ దొంగలనా? అనే అనుమానం వస్తుందని ప్రజలు వాపోతున్నారు.

 

రామకృష్ణ ‘ఎల్లోట్యాక్స్’ వెలుగులోకి రావడంతో అధికార టీడీపీ ఆత్మరక్షణలో పడింది. నష్టనివారణ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పార్టీ నేతలతో రోజంతా మంతనాలు జరిపారు.

 

తర్వాత పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రామకృష్ణ ప్రెస్ మీట్ ఉంటుందని మీడియాకు సమాచారం ఇచ్చారు. ముందుచెప్పినట్టు పార్టీ ఆఫీసులో కాకుండా హోటల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే విలేకరుల సమావేశానికి రామకృష్ణ మొహం చాటేశారు.

 


చివరకు "మాంటెకార్లో కంపెనీ మాజీ ఉద్యోగి రాము" ను మీడియా ముందుకు తీసుకొచ్చారు. మీడియా ప్రతి నిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తంటాలు పడ్డాడు రాము. ఫోన్ ఆడియోలో ఉన్న గొంతు తనదేనని ఒప్పుకున్నాడు.

 

ఓబులవారిపల్లి-కృష్ణపట్నం రైల్వే లైన్ నిర్మాణం పనులకు రూ. 5 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే రామకృష్ణ బెదిరించినట్టు మాంటెకార్లో కంపెనీ ప్రతినిధులు సోమవారం వెల్లడించారు. ఎమ్మెల్యే బెదిరింపుల ఆడియో సీడీలు మీడియాకు విడుదల చేశారు. ఎమ్మెల్యే దాష్టీకం పై రైల్వేమంత్రి కి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోయారు.

 

ఈ ఎల్లోటాక్స్ దందా పై సెంట్రల్ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది. ఓబులవారిపల్లి-కృష్ణపట్నం రైల్వే లైన్ నిర్మాణం పనులు నిలిచిపోవడంపై ఆరా తీసింది. ఎమ్మెల్యే రామకృష్ణ రూ.5 కోట్ల లంచం డిమాండ్ వ్యవహారంపై ఇంటెలిజెన్స్ వివరాలు సేకరించింది.

 

మాంటెకార్లో కంపెనీ ప్రతినిధులతో ఇంటెలిజెన్స్ అధికారులు మాట్లాడినట్టు సమాచారం. నేను నిప్పి నా వాళ్ళు నీతి నిజాయతీ పరులనే టిడిపి అధినేత ఇప్పుడేమి చెపుతారని ఆంధ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇదే ఇలా ఉంటే అమరావతి నిర్మాణానికి, పోలవరానికి ఎన్ని కంతలు పెడతారో నని జనం కలవర పడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: