చైనాలో ఉద్యోగినుల నగ్న దేహం పై వికృత ప్రచార విన్యాసం

 "పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా" లో వ్యాపారం వికృతపోకడలు పోతూ, కొత్త పుంతలు తొక్కుతుంది. అసలే కమ్యూనిస్టుల పాలన కాని పక్కా క్యాపిటలిస్టులమని చెప్పుకునే దేశాలు సైతం వెనుకడుగు వేసే జుగుప్సాకరమైన ధోరణిని అనుసరిస్తున్న చైనీస్ కంపెనీలపై ఆ దేశ పౌరులేకాక యావత్ ప్రపంచం భగ్గుమంటున్నది. చైనాలో అతిపెద్ద ఆభరణాల కంపెనీ ఏం చేసిందో చదివితే సదరు చర్యను మీరూ అసహ్యించుకుంటారు.

 

చైనా, హాంకాంగ్ లలో ప్రతి రోజూ కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను విక్రయించే 'చావ్ లుక్ ఫొక్' అక్కడ అతిపెద్ద జువెలరీ కంపెనీ. ఇటీవలే కొత్త మోడల్ వజ్రాలను మార్కెట్ లోకి విడుదల చేసిన కంపెనీ, వాటికి ప్రచారం కల్పించడంలో భాగంగా స్టోర్లలో పనిచేసే అమ్మాయిల చేత చేయించకూడని పనులు చేయించింది. కొత్త డైమండ్లను సూచిస్తూ వాటి ఆకారంలోని రెండు పీలికలు తప్ప ఒంటిపై భాగంలో అచ్ఛాదన లేని అమ్మాయిలను జ్యువెలరీ స్టోర్లలో నిలబెట్టి కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

 

స్టోర్ లోకి ప్రవేశించగానే, ఇబ్బందికంగా నిల్చున్న అమ్మాయిలను చూసి కొనుగోలుదారు లంతా అవాక్కయ్యారు. కొందరైతే కంపెనీ తీరును బాహాటం గానే తప్పుపట్టారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా నెటిజన్లు సైతం చైనా కంపెనీ తీరును గర్హిస్తున్నారు. ఏ రకంగా చూసినా జువెలరీ కంపెనీ చర్య సమర్థనీయం కాదని, వికృతానికి పాల్పడిన కంపెనీ లైసెస్సులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ది గ్రేట్ చైనా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ఇక కమ్యూనిస్టులను సర్వదా సమర్ధించే మన బంగా, కేరళ సి.పి.ఎం సోదరులు ఏమంటారు?

 

మన ప్రజాస్వామ్య దేశంలో అలాజరగటానికి ఎలాంటి వీలు లేదు. పొరపాటున ఏ నికృష్ఠ వ్యాపార సంస్థో ఇలాంటి పని చేస్తే మన తింగిరి కమ్యూనిష్టులేం చేస్తారో? ఎంత రాగ్ధాంతం చేస్తారో మనకందరికి బాగా తెలుసు. ఇప్పుడు భారత కమ్యూనిష్టులందరిని సి.పి.ఐ & సి.పి.ఎం ఇంకా మిగిలి ఉన్న తామరతంపర గాళ్ళని చైనా మీదకు వెళ్ళి ఆ దుర్మార్గాలని ఆపించాలని కోరుతున్నారు భారత ప్రజలు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: