కాశ్మీర్లోని నది విషయంలో భారత్ కు ఆ హక్కుంది !

Ravi Chandra
 భారత్, పాక్ ల మధ్య నలిగిపోతున్న మరో సమస్య కిషన్ గంగ ప్రాజెక్టు. ఈ వివాదానికి నెదర్లాండ్స్‌లోని హాగ్‌లో ఉన్న అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టు తెరదించింది.  ఈ ప్రాజెక్టు కోసం కిషన్‌గంగ నది నీటిని జలవిద్యుత్ ప్లాంటుకు తరలించేందుకు భారత్‌కు హక్కుందని తెలిపింది. యాభై ఏళ్ళ ముందు ఇరు దేశాల మధ్య కుదిరిన సింధు జల ఒప్పందం ప్రకారం భారత్ కిషన్‌గంగ నది నీటిని జలవిద్యుత్ ఉత్పాదనకు తరలించుకోవచ్చని పేర్కొంది. అయితే పాక్ వ్యవసాయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నదిలో కనీస నీటి ప్రవాహం ఉండేలా చూడాల్సిన బాధ్యత భారత్‌పై ఉందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం పాక్షిక తీర్పును ఇచ్చింది. ఇరు దేశాలు నది ప్రవాహానికి సంబంధించిన తాజా గణాంకాలు అందిస్తే ఈ ఏడాది చివర్లోగా కనీస నీటి ప్రవాహం స్థాయిని ఖరారుచేస్తూ తుది తీర్పు వెలువరిస్తామని హాగ్‌లోని కోర్టు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: