పాలమూరు గర్భశోకం

murali
  పేదరికం.. నిరక్షరాస్యత ఆ తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలిస్తోంది. కష్టాలు తలచుకొని నవ మాసాలు మోసి కన్న పసిగుడ్డునే ఆ తల్లులు విక్రయం పేరుతో దూరం చేసుకుంటున్నారు.. దీనికి తోడు తీవ్ర వర్షాభావం.. పంటలు పండవు... పండినా గుట్టుబాటు రాదు.. చేద్దామన్న పని దొరకదు... దొరికినా కూలీ అందదు... తిండిలేక అర్ధాకలితో అలమటిస్తూ.. ఆకలికి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. మరికొందరు అమాయక గిరిజన తల్లిదండ్రులైతే చేసిన అప్పులు తీర్చలేక తమ పిల్లలను ప్రసవించిన ఆసుపత్రుల్లోనే విక్రయిస్తూ తీవ్ర గర్భశోకాన్ని కడుపులోనే దాచుకుంటున్నారు. ఖర్మ ముంచుకొచ్చినట్టు ప్రభుత్వ పథకాలు సైతం వీరికి ఆమడదూరంలో ఉంటాయి. దీంతో చేసేదిలేక పొట్ట చేతబట్టుకొని ముంబయి, పూణె, బెంగుళూరు, హైదరాబాద్ వంటి మహానగరాలకు వలస పోతుంటారు. వీరే మహబూబ్ నగర్ జిల్లా వాసులు. మహానగరం హైదరాబాద్ కు ఆనుకొనే ఉన్నా ఈ జిల్లా ప్రజల బతుకులు మాత్రం బహు దుర్భరం. ఇటీవలే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పసిపిల్లల విక్రయాల వ్యవహారం వెలుగు చూసిన విషయం విధితమే.  దీనిపై అసలు విషయం తెలిస్తే ఒళ్లు గగుర్పొడచక మానదు. పేదరికం... ఆకలి చావులే ఆ తల్లిదండ్రులు పసి పిల్లల విక్రయాలకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. పేదరికం, కష్టాల నుండి తాము ఎలాగూ బయట పడలేమి తెలిసి.. కనీసం కన్నపేగు తెంచుకొని పుట్టిన పసిగుడ్డైన బాగుంటే అదే పదివేలు. అనుకుంటూ కొందరు తమ పిల్లలను పుట్టిన కొన్ని రోజుల్లోనే గుట్టుచప్పుడు కాకాండా విక్రయానకి వేలం వేస్తున్నారు.  అప్పు తీర్చుకోవడానికి, కష్టాలను దూరం చేసుకోవడానికి, కడుపు నింపుకోవడానికి వెయ్యో.. రెండు వేలో తీసుకొని లోకం చూడని పసికందులను దుఖా:న్ని దిగమింగుకొని అమ్మేస్తున్నారు. కాగా చిన్నపిల్లల ఆసుపత్రుల్లోనే ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇది నాణ్యానికి ఒకవైపు అయితే మరో వైపు పేదరికంతో మగ్గిపోతున్న కుటుంబాలపై కొందరు దళారులు దృష్టిసారిస్తున్నారు. పసిమొగ్గల విక్రయాలపై తల్లిదండ్రులను ఒప్పించి ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలకు నిర్దాక్షిణ్ణంగా అమ్మివేస్తున్నారు. వచ్చిన కమీషన్ లో తల్లిదండ్రులకు నయోనో.. బయోనో ఇచ్చి తప్పించుకుంటున్నారు. ఈ కుంభకోణంలో ఆర్ ఎంపి వైద్యులే మధ్య దళారులుగా అవతారం ఎత్తి ఈ తతంగాన్ని దగ్గరుండి జరిపిస్తుండటం సభ్య సమాజం తలదించుకోవాల్సిన విషయం. ఇటీవల రంగారెడ్డి జిల్లా పరిగి మండలంలో సాయిశ్రీ చిల్ర్డన్ ఆసుపత్రిపై వైద్యాధికారులు జరిపిన దాడుల్లో ఇలాంటి సంఘటనే బయట పడటం గమనార్హం. .  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: