కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినాయకత్వంలో కులసమీకరణలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చాలని కేంద్ర నాయకత్వంపై నానాటికి ఒత్తిడి పెరుగుతోంది. అయితే సమర్థులు లేనందు వల్ల ఇది కుదరదనే అభిప్రాయంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది.
అయితే ఎవరో ఒకరిని చూసి ముందు సిఎం కిరణ్ కుమార్ స్థానంలో తమవారిని కూర్చోపెట్టాలని అభిప్రాయంతో కాపునాయకులు గట్టిపట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనిలో భాగంగానే కాపుసామాజిక వర్గం ప్రతినిధులు పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణపై ఒత్తిడి చేస్తున్నారని సమాచారం.
తనకు అవకాశం ఇవ్వనందున తానేమీ చేయలేకపోతున్నానని బొత్సా వారికి వివరిస్తే కనీసం రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవికి అవకాశం ఇప్పించాలని వారు సూచించినట్లు భోగట్టా! దీంతో తమ దౌత్యం ఫలిస్తోందని భావించిన కాపునాయకులు మరికొందరు కాంగ్రెస్ సీనియర్లుతో ఇదే మాట వినిపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
సీనియర్లతో ఇలా వ్యాఖ్యానాలు చేయించిన తరువాత చిరంజీవకి మద్దతుగా కాంగ్రెస్ హైకమాండ్ ను కలిసేందుకు కాపునాయకులు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే సోనియాగాంథీ తనను కలవటానికి చిరంజీవికి అపాయింట్ మెంటు ఇవ్వలేదు. దీంతో రాహుల్‌గాంధీ తరుఫు నుంచి నరుక్కరావాలని కాపునాయకులు యోచిస్తున్నారట.
ఆంధ్రా నుంచి వచ్చిన అందరితోనూ మాట్లాడుతున్న రాహుల్‌గాంధీ మరి సిఎం పదవి విషయంలో ఏమి మాట్లాడుతారో అన్న ఆసక్తి నెలకొంది. కాపునాయకుల ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో ? కానీ, రాష్ట్ర అధినాయకత్వంలోనూ కులసమీకరణలకు వీరి ప్రయత్నాలు కారణమవుతున్నాయి. సి.ఎం కిరణ్ కుమార్ రెడ్డి గట్టి వాడు, సమర్థుడు అనే బావనను హైకమాండ్ వద్ద కల్పించడానికి రెడ్డి సామాజీక నేతలుప్రయత్నిస్తున్నారు.
వీరి ప్రచారం కాపునాయకుల ప్రయత్నాలకు వ్యతిరేకంగా పని చేస్తుందని ఇప్పటికే సి.ఎం ఒక అభిప్రాయానికి వచ్చారు. అందుకే ఆయన ధీమాగా ఉన్నారు. విషయం ముందుగానే లీకైనందున కాంగ్రెస్ హైకమాండ్ జరుగున్న మొత్తం పరిణామాలపై దృష్టిసారించింది.
మరింత సమాచారం తెలుసుకోండి: