‘ఆ స్కీం జోలికి వెళ్లొద్దు’

 హైదరాబాద్: పేద విద్యార్థలకు ఇప్పటి దాకా ప్రభుత్వం చెల్లిస్తున్న ఫీజులలో కట్టింగ్ పెట్టే విధానం రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారబోతోంది. ఫీజుల విషయంలో సర్కార్ చేతులెత్తేసింది. దీనిపై పార్టీ వెలపల, బయట అనేక విమర్శలకు గురి కావల్సి వస్తోంది. లక్షలాది మంది పేద విద్యార్థులకు సంబంధించి ఫీజుల విషయంలో సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రతిపక్ష పార్టీలతో పాటు పార్టీకి చెందిన వారు అసంత్రుప్తితో ఉన్నారు. రాష్ర్ట మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్ గౌడ్, మాజీ మంత్రి శంకర్రావు మంగళవారం నాడు వేర్వేరుగా మాట్లాడుతూ ఈ ఫీజుల పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలనీ, ఈ విషయమై తాము కూడా సీఎంతో మాట్లాడుతామన్నారు. ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోకుంటే రాష్ర్టంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లడం ఖాయమనీ వారన్నారు. ఫీజులను ఎత్తివేసి ప్రభుత్వం ప్రతిపక్షాలకు చేతినిండా పని కల్పించింది.  ఈ ఫీజులను యథాతథంగా అమలు చేయాలంటూ ఇప్పటికే విద్యార్థి సంఘాలు విజయవాడ, నల్గొండ, ఖమ్మం తదితర ప్రాంతాల్లో సీఎం దిష్టి బొమ్మను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. మరో పక్క తెలంగాణ రాష్ర్ట సమితి ఈ నె 8న మండల కేంద్రాల్లో, 10న జిల్లా కేంద్రాల్లో పెద్దయెత్తున ఆందోళనలు చేపట్టనున్నది. 12, 13రోజుల్లో ఏలూరు వేదికగా వైఎస్ఆర్ పార్టీ గౌవర అధ్యక్షురాలు విజయమ్మ దీక్ష చేయబోతున్నారు. ఏకీక్రుత ఫీజులు అమలు చేయాలనీ సుప్రీంకోర్టు ఇచ్చిర తీర్పు నేపథ్యంలో వ్రుత్తి విద్యా కళాశాలల్లో పెరగనున్న ఫీజులను విద్యార్థులే చెల్లించుకోవాల్సిందిగా రాష్ర్ట ప్రభుత్వం చెబుతోంది. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్ మెంటు పథకం కింద కన్వీనర్ కోటాకు చెల్లిస్తున్న 31వేల రూపాయలు మాత్రమే రాష్ర్ట ప్రభుత్వం చెల్లిస్తుందనీ మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు.  మిగిలిన ఫీజును విద్యార్థులే కట్టుకోవాలంటున్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మాత్రం పెరిగిన ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తదన్నారు. ఈ రెండు కులాల విద్యార్థులకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల నిధులతో ఫీజులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఫీజు రీయింబర్స్ మెంటుకు, ప్రత్యామ్నాయాలు, నాణ్యమైన విద్య కోసం నియమించిన నిపుణుల కమిటీ ఫీజుల కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక ఇచ్చిన విషయం విధితమే. దీనిపై మంత్రుల కమిటీ చర్చించించింది. ఏకీక్రుత ఫీజుల ద్వారా వ్రుత్తివిద్యా కళాశాలలో పెరిగే ఫీజును విద్యార్థులే చెల్లించుకోవాలనీ, ప్రభుత్వం చెల్లించగా మిగిలిన ఫీజుల కోసం విద్యార్థులు బ్యాంకుల్లో రుణం తీసుకుంటే ప్రభుత్వం కొంత సబ్సిడీ చెల్లించే విధంగా నిర్ణయించినట్లు పితాని చెప్పారు. ప్రతి విద్యార్థి చదువుకుంటున్న వారి వారి కోర్సుల్లో 50శాతం సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించాలనీ, లేదంటే తదుపరి విద్యా సంవత్సరానికి ఫీజులు చెల్లించబోమని కూడా మంత్రి తెలిపారు. ఈ మంత్రుల కమిటీ తీసుకున్ననిర్ణయాలే లొల్లికి కారణమైంది.  రాష్ర్ట ప్రభుత్వానికి ఈ పథకం ఎంతో పేరు తెచ్చి పెట్టింది. అలాంటి పథకాన్ని ఎత్తివేసి లక్షలాది మంది పేద విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చబోతోంది. దీనిపై అటు విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు రాష్ర్ట వ్యాప్త ఆందోళనకు సిద్దమవుతున్నాయి. రాష్ర్ట కేబినెట్లోని మంత్రులు కూడా ఈ పథకం జోలికి వెళ్లవద్దంటున్నారు. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. మరి ముఖ్యమంత్రి కిరణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: