2014లో మారనున్న రాజకీయ సమీకరణాలు.... కొత్తపార్టీ వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా?

Durga
 2014 లో రానున్న ఎన్నికలలో ఊహించని విధంగా రాజకీయ సమీకరణాలు మారునున్నాయని. రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వారు స్వతంత్ర్యం వచ్చిన దగ్గరనుండి దాదాపు యాభై సంవత్సారాలు యదేచ్ఛగా పరిపాలించారు. ప్రస్తుతం వారే పరిపాలిస్తున్నారు. కాంగ్రెస్ 51 సంవత్సారల పరిపాలనలో అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైనారు. విద్యా,వైద్య, వ్యవసాయ రంగాలలో పూర్తిగా విఫలమై ప్రజలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారు.  నిరుద్యోగ సమస్య, విద్యుత్ సమస్య, రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు రేటులేక నిత్యావసర వస్తువులు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అనేకసార్లు పెంచారు. వెండి, బంగారం రేట్లు, సామాన్యులకు అందుబాటు లేకుండా పెంచారు. మూడు ప్రాంతాలలో అర్ధికంగా సమాజికంగా ప్రజలు వెనకబడివున్నారు. అన్నిరంగాలలో అవినీతి, అసమర్థత, జవాబుదారిలేని పాలనసాగించారు. కల్తిఎరువులు, కల్తివిత్తనాలు,కల్తిపురుగులమందులను చేసే కంపెనీలను అరికట్టడంలో విఫలమయ్యారు.  బ్లాక్ మార్కెట్ లో అమ్ముతున్నా పట్టించుకునే నాధుడే కరవయ్యారు. మతఘర్షణలు, కులాలలో చిచ్చు పెట్టి ప్రభుత్వాన్ని నిరంకుశంగా పరిపాలిస్తున్నారు. లెక్కలేనన్ని ఇంజనీరింగ్, వృత్తివిధ్యా కళాశాలలు పెట్టి (750) లక్షాలాది మందిని నిరుద్యోగులుగా మిగిల్చారు. విద్యార్థులు బీ టెక్, ఎంటెక్ చదివి అప్పులపాలై తల్లిదండ్రులకు బారమై ఉపాధిలేక అలమటిస్తున్నారు.  లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి ఎలా చూపించుటకు ముందుచూపులేదు, ప్రణాళికలూ లేవు. పథకాలూ లేవూ. గుడ్డిగా విద్యావ్యాపారానికి అనుమతిలిచ్చి కళాశాల యాజమాన్యాన్ని కుబేరులుగా చేస్తున్నారు. చదువు పూర్తిచేసిన విద్యార్థలకు 10 శాతం మాత్రమే ఉపాది కల్పిఃస్తే మిగితా 90 శాతం అప్పులపాలై తల్లిదండ్రులకు భారమై అవమానకర జీవితాలు సాగిస్తున్నారు. కాంగ్రెస్ 51 సంవత్సరాల రాష్ట్రపాలనలో కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు కోట్లాదిరుపాయలు దండుకున్నారు. కొన్ని లక్షల కోట్ల రూపాయలను నల్లధనం రూపేణ ఉన్నది. అవినీతి డబ్బుతో ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రతినియోజక వర్గానికి 10 కోట్లకు పైన ఖర్చుపెట్టి గెలుస్తున్నారు. ఇవి అన్ని కాంగ్రెస్ పార్టీ వారు సాధించిన ఘనత తప్ప 80 శాతం మంది సామాన్య ప్రజానికానికి మేలు చేసింది శూన్యం కనుక ప్రజలు కొత్తపార్టీ, కొత్త ప్రభుత్వం, నిస్వార్థంగా, అవినీతిలేని, సమర్థత గల జవాబదారి ప్రభుత్వం రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. మూడు ప్రాంతాలలో అన్నిరంగాలలో అభివృద్ది చెందాలని ప్రజలుతహతహలాడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం సుమారు 14 సంవత్సరాలు పరిపాలించింది. కానీ ప్రజలు ఆశించినంతగా రాష్ట్రాన్ని అభివృద్ది చేయలేక పోయింది. చిన్న చిన్నగా ఆ పార్టీ వారుకూడా ప్రజల సానుభూతి కోల్పొయింది. టీడీపీ కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఇక సీపీఐ, సీపీఎం, బీజేపీ, లోక్సత్తా, ఎంఐఎం వారికి అందరికి కలిపినా 20 సీట్లు కూడారావు, తెలంగాణా వస్తే టీఆర్ఎస్కు 70శాతం సీట్లు వచ్చే అవకాశం వుంది. రెండొవస్థానంలో వైఎస్సార్సీపీ ఉండవచ్చునని ప్రజలు భావిస్తున్నారు. సీమాంధ్రలో మొదటి స్థానంలో అత్యదిక మెజార్టీతో వైఎస్సార్సీపీ వుండవచ్చు. రెండస్థానంలో టీడీపీ మూడో స్థానంలో కాంగ్రెస్ ఉండవచ్చనని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ఠ్రం సమైఖ్యంగా ఉంటే వైఎస్సార్సీపీకే అత్యధిక సీట్లు వచ్చ ప్రభుత్వాన్ని స్థాపించే శక్తి వైఎస్సార్సీపీ కే ఉంటుందని రాజీకీయ విశ్లేషకులు, ప్రజలు బావిస్తున్నారు. టీఆర్ఎస్ రెండవ, మూడో స్థానంలో టీడీపీ, నాలుగోవ స్థానంలో కాంగ్రెస్ లు ఉంటాయని భావిస్తున్నారు. కొత్త పార్టీ, కొత్త విధానాలు రావాలని, అభివృద్ధి జరగాలని, సుపరిపాలతన రావాలని ప్రజలు రాజకీయ విశ్లేషకులు, మేధావులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థి, యువజనులు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: