రిపబ్లిక్ డే .. ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాలి..!

Chakravarthi Kalyan
భారత స్వతంత్రపోరాటంలో భాగంగా గాంధీజీ జనవరి 26, 1930 ను పూర్ణ్ స్వరాజ్ దివస్ గా పేర్కొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ ఈ మేరకు ఓ తీర్మానం చేసింది. అప్పటి నుంచి జనవరి 26ను స్వరాజ్ దివస్ గా జరుపుకుంటూ వస్తున్నారు. 1947లో ఆగస్ట్ 15 స్వతంత్ర్యం వచ్చాక ఆగస్ట్ 15ను స్వతంత్ర్య దినోత్సవంగా జరుపుకుంటున్నాము. 



భారత రాజ్యాంగ రచన పూర్తయ్యాక.. జనవరి 26, 1950 నుంచి దాన్ని అమల్లోకి తెచ్చుకుని గణతంత్రదినోత్సవంగా జరుపుకుంటున్నాం. స్వతంత్ర్యం వచ్చిన తర్వాత మూడేళ్లకు 1950 జనవరి 26ను మొదటి గణతంత్రదినోత్సవంగా జరుపుకున్నాం. 


ఆనాటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్నో 1950 నాటి గణతంత్ర్యదినోత్సవానికి అతిథిగా విచ్చేశారు. బాబూ రాజేంద్రప్రసాద్ మొదటి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. 
గణతంత్ర ఉత్సవాలు కేవలం జనవరి 26 ఒక్కరోజుకే పరిమితం కావు.. జనవరి 27, 28, 29 కూడా అనేక రకాల ఉత్సవాలు జరుగుతాయి. 29న జరిగే బీటింగ్ రిట్రీట్ తో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. 


1955 నుంచి ఢిల్లీలోని రాజ్ పథ్ ఈ గణతంత్ర ఉత్సవాలకు శాశ్వత వేదిక అయ్యింది. అంతకుముందు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఈ వేడుకలు నిర్వహించేవారు. 1955లో మొదటిసారి పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మాలిక్ గులామ్ మొహ్మద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకల్లో ఎబైడ్ విత్ మీ అనే క్రిస్టియన్ పాటను వినిపిస్తారు.. ఇది గాంధీజీకి అత్యంత ఇష్టమైన పాటకావడమే అందుకు కారణం.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: