ఆ ఫోన్ కాల్ పది పెళ్లిళ్లను ఆపేసింది...!!

Shyam Rao

సభ్య సమాజం ఆధునిక పోకడలు తొక్కుతున్నా మనుషుల ఆలోచనల్లో మాత్రం ఎటువంటి మార్పు రావట్లేదు. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. మనుషుల అలవాట్లలో ఆధునికత ఉన్నా వారి ఆలోచనలో మాత్రం వెనకట అమలులో ఉన్న ఆచారాలనే వీరి ఇప్పటికీ అనుసరిస్తున్నారు. బాల్య వివాహాలను భారత ప్రభుత్వం స్వాతంత్రం రాగానే నిషేధించుతే ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో అవి ప్రత్యక్షం అవుతూనే ఉన్నాయి. 



ఆ ఫోన్‌కాల్‌ పదిమంది బాలికల జీవితాల్ని నిలిపింది.. ఆ బాలిక తెగువ పది బాల్యవివాహాలను ఆపింది. ఈ ఘటన కేరళలోని మలప్పురం జిల్లాలోని కరువరకుండు పంచాయతీలో చోటుచేసుకుంది. పెళ్లీడు రాక‌ముందే త‌న‌కు త‌న వాళ్లు పెళ్లి చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, రానున్న వేసవిలో త‌న పెళ్లి చేయాల‌నుకుంటున్నార‌ని ఆ బాలిక చైల్డ్‌లైన్ అధికారుల‌కు ఫోన్ చేసి చెప్పింది. తాను చదువును కొనసాగించాలనుకుంటున్నానని.. ఈ వివాహం జరిగితే చనిపోతానని చెప్పింది. ఇలాగే మరో పది మంది వివాహాలు జరగనున్నాయనే సమాచారాన్ని అందజేసింది.



త‌మ పంచాయ‌తీ ప‌రిధిలో త‌న‌తో పాటు మ‌రో ప‌ది మంది బాలిక‌లకి 16 ఏళ్లు కూడా నిండ‌లేద‌ని, వారంద‌రి వివాహాలు కూడా జ‌రుపుతున్నార‌ని తెలిపింది. . దీంతో స్పందించిన చైల్డ్‌లైన్‌ అధికారులు కరువరకుండులో విచారించగా.. 10 మంది బాలికల వివాహాలు ఈ ఏడాది ఏప్రిల్‌, మేలో జరగబోతున్నట్లు తేలింది.



 ఆ బాలిక‌ల పెళ్లిళ్ల‌ను రానున్న వేస‌విలో చేయాల‌ని నెల రోజుల క్రితం నిశ్చ‌యించారు. ఆ బాలికలంద‌రూ ఒకే మతానికి చెందిన వారు. వారంతా పేద కుటుంబాల‌కు చెందినవారే.  ఈ నేపథ్యంలో ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాల్సి వస్తే ఆ ఖర్చు భరించలేమని తల్లిదండ్రులు భావిస్తున్నారట. ఈ పెళ్లిళ్లను ఆయా పంచాయతీ వార్డు సభ్యులు, బాల్య వివాహం నివారణ అధికారి కలిసి రద్దు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: