ఎం.ఎల్.ఏ. అనిత మాట్లాడిన తీరు అత్యంత భాధాకరం: రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ



మహిళలకు తెలుగు దెశం ప్రభుత్వ హయాం లో ఏమాత్రం రక్షణ లేదని దానికి తోడు ఆ పార్టీ మహిళా శాసనసభ్యులే మహిళలకు హాని చేస్తున్నట్లు అర్ధమౌతుంది. వంగలపూడి అనిత అనే శాసనసభ సభ్యురాలు విచ్చలవిడిగా మాట్లాడటం దానికి పీతల సుజాత అనే మరో శాసనసభ సబ్యురాలు వంత పాడటం విచిత్రంగానే కాదు ప్రణాళికా బద్దంగానే జరుగుతున్నట్లు దీనికి అధిష్టానం ఆమోదముద్ర ఉన్నట్లు అభిజ్ఞవర్గాల కథనం.

 

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనిత శాసనసభలో చేసిన నిరాధారమైన వ్యాఖ్యలపై రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తీవ్రమన స్తాపానికి గురయ్యారు. అసెంబ్లీలో తమ గురించి ఎమ్మెల్యే అనిత ఎందుకు మాట్లాడారో అర్థం కాలేదన్నారు. "రిషితేశ్వరి చనిపోయాక తాము సంతృప్తిగా ఉన్నమనటం సంస్కారం  గాదు, సమంజసమూ కూడా కాదన్నారు. తన కుమార్తె  మరణం తర్వాత మేమెలా సంతృప్తిగా ఉండగలం?  అంతేకాదు,  ఎమ్మెల్యే అనిత ఏ రోజు తమని కలవలేదని, కనీసం తమకు ఫోన్‌ కూడా చేయలేదని మురళీకృష్ణ తెలిపారు.




అలాంటిది తాము కూతురు చనిపోయిన తర్వాత సంతృప్తిగా ఉన్నామని ఎమ్మెల్యే అనిత ఎలా చెబుతారని ఆయన సూటిగా ప్రశ్నించారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణమైనవారికి ఇంకా శిక్ష పడలేదని, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయా లని కోరినప్పటికీ ఇప్పటివరకూ ఫాస్ట్‌ -ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయలేదన్నారు. 


కాగా మంగళవారం శాసనసభలో ప్ర‌శ్నోత్త‌రాల్లో భాగంగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి  మహిళ‌ల‌కు ర‌క్ష‌ణ అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవ‌లి కాలంలో రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మ‌హిళ‌ల‌పై చోటుచేసుకున్న దాడులు, ఆ దాడుల్లో నిందితుల‌కు టీడీపీ నేత‌లు అండ‌గా నిలిచిన వైనాన్ని ప్ర‌స్తావించారు.

 



ఈ సంద‌ర్భంగా ఆమె:

 

*ఎమ్మార్వో వ‌న‌జాక్షిపై తెలుగు దేశం పార్టీ విప్ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ చేసిన దాడి, 

*ఆచార్య నాగార్జున వ‌ర్సిటీలో ఆత్మ‌హ‌త్య చేసుకున్న రిషితేశ్వ‌రి, ఆ ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మైన ముద్ధాయి యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ బాబురావుకు తెలుగు దేశం అండ‌,

*సీఎం చంద్రబాబు స‌భ‌కు ద‌ళిత‌ స‌ర్పంచ్‌ను హాజ‌రుకానివ్వ‌కుండా అడ్డుకున్న వైనంపై పత్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల‌ను ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సభ దృష్టికి తీసుకువచ్చారు.




దీనిపై అధికార పార్టీ సభ్యురాలు వంగ‌ల‌పూడి అనిత మాట్లాడుతూ టీడీపీ పాల‌న‌లో మ‌హిళ‌ల‌కు రక్షణ ఉందని సమర్థించు కున్నారు. "రిషితేశ్వ‌రి ఘ‌ట‌న‌లో చంద్ర‌బాబు స‌ర్కారు న్యాయం చేసింద‌ని బాధితురాలి త‌ల్లిదండ్రులే చెప్పార‌ని ఆమె చెప్పుకొచ్చారు, అంతేకాదు రిషితేశ్వరి తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగిందంటూ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్‌ చేశారంటూ చెప్పడం" సమస్యను ఇంకా ఝటిలం చేసింది. అయితే ఆ న్యాయం ఏ విధంగా జ‌రిగింద‌న్న విషయాన్ని మాత్రం అనిత ప్ర‌స్తావించ‌క‌ పోవ‌డం గ‌మ‌నార్హం. రిషితేశ్వరి చనిపోయిన బాధను వాళ్ల తల్లిదండ్రులే మరిచిపోతుంటే ప్రతిపక్షం పదే పదే గుర్తు చేస్తోందంటూ ఎద్దేవా చేశారు.

 

అయితే రిషితేశ్వ‌రి ఆత్మ‌హ‌త్య‌కు దారి తీసిన ప‌రిస్థితులు, బాబురావు నిర్వాకం మరచిపోయే విషయాలా? శాసనసభ్యురాలు మహిళలకు జరిగిన అన్యాయాలు దగాలు ప్రజలు మరచిపోతే సరి పోతుందని ఔకుంటున్నారా? ప్రజలు మరచిపోవటమే టిడిపి పరిష్కారమార్గమా? ఉపాద్యాయిని అయిన అనిత తీరు సరత్రా ప్రశ్నార్ధకమే నని ప్రజలు భావిస్తున్నారు.




మహిళలకు జరిగిన అన్యాయాలను వాటిపై ఎలాంటి నివారణకు చర్యలు తీసుకున్నారనే దానిపై ఎమ్మెల్యే అనిత ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అసలామెకు ఏ విషయంపై అవగాహన లేదని, హోం వర్క్ చేసే పరిజ్ఞానమైనా ఉందా? అంటున్నారు విధ్యార్ధులు. విద్యార్థుల‌పై ఈ త‌ర‌హా చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబురావుపై చ‌ర్య‌లు ఎందుకు తీసుకోలేద‌న్న విష‌యాన్ని ఏ మాత్రం ఆమె ప్ర‌స్తావించ‌లేదు సరికదా, ఆయనకు వ‌త్తాసు ప‌లికిన తీరు అత్యంత అమానేఎయమని ఆ కుటుంబం ఆక్రోసిస్తుంది.

 

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలను రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ పూర్తిగా అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా నాగార్జున యూనివర్సిటీలో చోటుచేసుకున్న ఆ నాటి అమానవీయ సంఘటనలను పరోక్షంగా మహిళా శాసనసభ్యురాలు అనిత అన్యాపదేశంగానే కాదు బహిరంగంగానే చెప్పినట్లు ప్రజలు భావిస్తున్నారు.  బాబురావు దుర్మార్గాల ఫలితంగా తీవ్ర అవమాన భారంతో 2014 జూన్ 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం అతి తేలికైన ఇషయం కాదు. ఇలాంటి మహిళా శాసన సభ్యురాలు సభలో ఉండటం తెలుగు మహిళలకే ధారుణ పరాభవం అంటున్నారు. పీతల సుజాత పదిలక్షల రూపాయిలు లంచం తీసుకొని పట్టుబడటంతో ఏవరో బాగు అక్కడ తనింట్లో వదిలేసి వెళ్ళారన్నబుకాయింపు  జనం మరవరు.


 



ప్రజాక్షెత్రంలోకి వస్తే వీళ్ళ బ్రతుకు బయటపెట్టటానికి జనం ఓట్ అనే గంద్రగొడ్డలిని పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. పట్టభద్రుల నియోజక వర్గం ఎన్నికల్లో అది ఋజువైంది కదా! అనిత సుజాత కాస్త సైలెంటైతే మంచిది. 

 

గుంటురులో డా.  శ్రీలక్ష్మి చేతులో ధారుణ పరాభవానికి గురైన డా.  సంధ్య,  డా.  రవి దంపతుల  ఆత్మహత్యకు టిడిపి ఏ  సమాధానం ఇంకా చెప్పలేదు. కాల్-మని ఆగడాలకు బలైన అమరావతి మహిళలకు ఎలా స్వాంతన కలిగించారో ఎం.ఎల్.ఏ. అనిత సమాధానం చెప్పగలరా? 



 

అసలు ఆ పార్టీ లో మహిళా సాధికారత లేనే లేదని మహిళా సాధికారత సదస్సు రోజే ఎం.ఎల్.ఏ. రోజాని ట్రీట్ చేసిన తీరే చెపుతుంది. చంద్రబాబు నాయుడుగారి పగ, కక్ష, ప్రతీకారం విషయములో మహిళలకు కూడా మినహాయింపులేదని తెలుస్తుంది. రోజా కంటే ధారుణంగా మాట్లాడిన వాళ్ళు ఆ పార్టీలోనే కోకొల్లలున్నారని ప్రజలంటున్నారు. దానికే సభ నుండి రోజా ఉద్వాసన చేయటం అత్యంత దుర్మార్గమని దాన్ని అనిత లాంటి మహిళా సభ్యులు సమర్ధించటం మరో మహానేరమని అంటున్నారు.

 

గుర్తించవలసిన విషయమేమంటే నేరస్తులంతా ఒకే సామాజిక వర్గానికి అదీ టిడిపి అధినేత సామాజిక  వర్గానికి చెందినవారే.  అంటే వారి సామాజిక వర్గం వాళ్ళు నేరస్తులైనా వారికి మినహాయింపు ఉందన్న మాట.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: