బాలయ్యను తెగ పొగిడిన జగన్.. కారణం అదేనా..?

Shyam Rao

వైసీపీ అధ్యక్షుడు జగన్ సినీ హీరో, ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే పై ప్రశంసల వర్షం కురిపించారు. పచ్చ పార్టీ నేతల పేరు ఎత్తితేనే అగ్గి మీద గుగ్గిలం అయ్యే జగన్ ఒక్కసారిగా ప్రశంసల వర్షం కురిపించారు. బుధవారం గన్నవరం విమానాశ్రయంలో ఎదురుపడిన టీడీపీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు ఆయన మాట్లాడారు. ‘మీ పార్టీ ఎమ్మెల్యేల్లో నీ మిత్రుడు ఒక్కడే మంచోడు. మిగిలిన వాళ్లలో ఎవరికీ ఆ లక్షణాలు లేవు’ అని జగన్‌ అన్నారట.



ఎందుకు జగన్ కి బాలయ్య పై అంత ప్రేమ పుట్టుకొచ్చింది..? అనేగా మీడౌటు..? దీనికి కారణాలు సైతం లేకపోలేదు. ఇప్పటివరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య ఎప్పుడూ కూడా తనను విమర్శించలేదని ఆయనతో చెప్పారట. బహుశా ఈ కారణంగానే బాలయ్య పై జగన్ కు ప్రేమ పుట్టిందేమో..?  మరో విషయం కూడా ఉంది! జగన్‌ ఒకప్పుడు కడప జిల్లాలో బాలకృష్ణ అభిమాన సంఘంలో క్రియాశీలంగా ఉన్నారు.



ఇది చాలాకాలం కిందటి సంగతి. ఆ అభిమానం ఇంకా ఉన్నట్లుంది’’ అని బాబూరావు వివరించారు. ఏది ఏమైనా సినిమా పరిశ్రమలో పని చేసిన వారు రాజకీయాల్లోకి వచ్చినా, వారు ప్రతిపక్ష పార్టీలో చేరినా వారిపై ఉండే అభిమానం మాతరం తగ్గదని వైసీపీ అధినేత జగన్ ను చూస్తే ఇక్కడ స్పష్టంగా అర్థం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: