వాటి జోలికెళ్తే..మక్కెలిరగ్గొడతా..ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్...!!

Shyam Rao

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కమలం పార్టీ ఘన విజయం సాహ్దించి అధికారాన్ని చేప్పట్టి.. పట్టగానే అటు ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్, ఇటు పార్టీ ఎమ్మెల్యే లు రాష్ట్రమో కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. ముఖ్యంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేందుకు ఆజ్ఞలు జారీ చేశారు. ముఖ్యంగా హిందూ సాంప్రదాయాల్ని, మత ధర్మాన్ని సంరక్షించే భాద్యత వీరు తీసుకున్నారు . యూపీలోని కటౌలీ నియోజకవర్గ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ మంత్రి సురేష్ రానాకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సాక్షిగా విక్రమ్ సైనీ పలు వ్యాఖ్యలు చేశారు.



మంత్రిపై పొగడ్తలు కురిపించే క్రమంలో ఆయన మాట్లాడుతూ, వందేమాతరం, భారత్ మాతాకీ జై అనేందుకు సందేహించేవారిని, , లేక గోవును వధించేవారు, లేదా గోవును హింసించే వారిని మక్కెలిరగ్గొడతానని ప్రమాణం చేస్తున్నానని అన్నారు. యూపీ సీఎంగా పగ్గాలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్‌ ఇప్పటికే అక్రమ గోవధశాలలపై కొరడా ఝళిపించారు. అక్రమ గోవధశాలలన్నీ మూసేయాలని ఆదేశించారు. శనివారం స్వస్థలం గోరఖ్‌పూర్‌ పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ ఉన్న గోశాలను ప్రత్యేకంగా సందర్శించారు.



మొత్తం మీద యోగి ప్రభుత్వం ఆవుల సంరక్షణ విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన యోగి ఆదిత్యనాథ్‌కు ఆవులంటే చాలా ఇష్టం. ఆయన ఆశ్రమంలో చాలా ఆవులు ఉన్నాయి. వాటిని ఆయన ఎంతో ప్రేమగా చూసుకునేవారు. చాలా సంవత్సరాలుగా యోగి ఆదిత్యనాథ్ గోసేవ చేస్తున్నారు. గోరఖ్‌నాథ్ ఆలయం ప్రాంగణంలోని గోశాలలో దాదాపు 460 ఆవులు, దూడలు ఉన్నాయి.



గోరఖ్‌పూర్ వెళ్లినప్పుడల్లా ఆయన ముందుగా ఆవులకు మేత వేసి, ఆ తర్వాత దూడలకు పాలు, రొట్టెలు, బెల్లం పెడుతుంటారని నైమిశారణ్య ఆశ్రమానికి చెందిన స్వామి విద్యా చైతన్య మహరాజ్ చెప్పారు.  ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆయన ఆశ్రమంలో ఉండటానికి కుదరదు. అధికారిక నివాసానికి తరలి వెళ్లాల్సిందే. లక్నోలోని సువిశాలమైన నెం.5 కాళిదాస్ మార్గ్ భవనానికి ఆయన వెళ్లనున్నారు. అయితే, తనతో పాటు తన ఆవుల మందను కూడా ఆయన ఆ భవనానికి తీసుకెళ్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: