తెలంగాణ vs ఆంధ్రప్రదేశ్ : శాసనసభలలో ఏవరి నిర్వహణ బాగుంది?



ఆంధ్రులు శతాబ్దాల ప్రత్యేక నాగరికత సంస్కృతి సంతరించుకున్న వారుగా, చక్కటి భాషాజ్ఞానులుగా, మాటలో తీయదనం చేతలో చురుకుదనం తమ స్వంతం అంటూ వుంటారు. అయితే వందల సంవత్సరాలు నిజాముల కాలములో దొరల నేతృత్వములో అణగారిన జీవితం అనుభవించి విసిగి వేసారి, నలిగిపోయిన తెలంగాణా వారిలో అ మాటనేర్పు చేత చేతనత్వం వ్యవవహారములో కమ్మదనం అంతగా కనిపించదు.


నాడైనా నేడైనా మన సంస్కృతి - సాంప్రదాయాలు, అచార - వ్యవహారాలు ప్రపంచానికి వ్యక్త పరచే వేదికలు మన శాసన సభలే. శ్రీకృష్ణదేవరాయల అధికార సభాభవనం భువనవిజయం గురించి సభాశీనుల, సభాసదుల పరిజ్ఞానం పటిమ నుంచి పొందిన సలహా సాంప్రదాయాలే నాటి పాలనను పరోక్షంగా శాసించేవి. నాటి భువన విజయ కళా సాంస్కృతిక వైభవం చిర స్మరణీయం. నాటి రాచరిక వ్యవస్థలో ప్రజాస్వామ్యం అంతర్లీనంగా పరిఢవిల్లింది.




మరినేటి శాసనసభలను భువన విజయ స్థాయిలో ఊహించగలమా? అసలు ఆ అలోచన మనకు రావటమే దుర్బరం కదా! నాటి నేతలు ప్రజల వెతల నిర్మూలనకై మానసమదనం చేసి సుపరిపాలన నందించే వారు. మరి నేటి నేతలు తామూ, తమ కుటుంబం, తమ బందుగణం, తమ కులం, తమ మతం తమ ఎన్నికలలో గెలుపు వీటి ఆధార పాలన తో సభలను పశువులు పాకలని, వరాహాల విడిదిని మరపిస్తున్నాయి.


ఒక్క రోజు భువనవిజయ సభాభవనం అపార జ్ఞానాన్ని వర్షిస్తే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ద్వారా ప్రవహించే బూతు ప్రవచనాలు ప్రవాహం లా కృష్ణ లో చేరి ఆ పవిత్ర జలాలను కలుషితం చేసి జనానికి బూతులనే జీవధారగా అందిస్తున్న ఘనత సాధిం చింది.  జలం జన జీవనాధారం కధా!


మన “ కొందరు  ప్రజానాయకుల నోరు  తెరుచుకున్న మురికి గుంటల ” ని చెప్పవచ్చు. (కలికానికైనా కనిపించని నీతివంత మైన మాటకారి ప్రతినిధులెవరైనా ఉంటే ఈ వ్యాఖ్యకు నన్ను క్షమించ మని మనవి)




రౌడీలు, గూండాలు, బ్రోకర్లు, మాఫియాగాళ్ళతో తరించిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్య వ్యవస్థలు పాలకులు వారి వందిమాగదుల స్వప్రయోజనాలకు అనుకూలంగా "ఆమ్యామ్యాలకోసం" పనిచేస్తున్నాయనే చెప్పవచ్చు. వివిధ ఖాతాల క్రింద నిర్దేశించిన విధంగా ఖర్చు చేయాల్సిన ప్రజాధనం కాంట్రాక్టర్లుకు అనుకూలంగా మార్చి ఖర్చుచేసిన సందర్భాలతో వాటిని ప్రశ్నించేవారి నోర్లు మూయించేంతవరకు బ్వూతు ప్రవచనాలు ప్రశ్నించేవారు విసుగుచెందేవరకు కొనసాగించటం ఒక దినవారి ఆనవాయితీగా మారిపోయింది.


శాసనసభలను ప్రజల కోసం విలువైన శాసనాల నిర్మాణానికి వేదికలు చేయవలసిన చోట దుర్మార్గుల పరిరక్షణ వేదికలుగా మార్చేసిన ఘనత మన ముఖ్యమంత్రి శ్రీమాన్ నారా చంద్రబాబు నాయుడు గారి విశ్వనగరం అమరావతి శాసనసభా కార్యక్రమం తొలి రోజే ప్రారంభమైనది.


ఇక్కడ ప్రశ్నించే ప్రతిపక్షం వారి ప్రశ్నను సభలో చర్చించి ప్రజాప్రయోజనాలకు వినియోగించకుండా, ప్రశ్నించిన వారి గత చరిత్ర వారి పాపాల చిఠ్ఠా అష్టొత్తర శతనామావళిగానో శహస్రనామావళిగానో మార్చి పటిస్తున్నారు. ఫలితంగా వీరు అదేతప్పులు చేస్తున్నారు గనుక రానున్న ఎన్నికల్లో ప్రతిపక్షములో కూర్చుంటారని ఎవరైనా అంటే - ఇప్పుడు ఇప్పటికి దోచుకున్నంత దోచుకుంటున్నాం గదా! అనేదే వారి సమాధానంగా కనిపిస్తుంది.




అధికార పార్టి అధినేతకు గాని, శాసనసభాపతికి కూడా లేని సంస్కృతిని వారు సభకెలా యివ్వగలరు? అందుకే ఆ సభ దుశ్శాసనులు ఉన్న కౌరవసభ కంటే ఎలా గొప్పదౌతుంది? ప్రతిపక్షం తాము ప్రభుత్వములో ఉన్నప్పుడు చేసిన నేరాలకు పశ్చాతాపం చెందేదెలా? ఈ సభలో కొత్తగా పొందిన అవమానాలకు భవిష్యత్తులో ప్రతీకారం తీర్చుకోవటానికే తన పథక రచన కొనసాగించటమే లక్ష్యంగా పనిచేస్తే, ప్రజలు తమ భూత భవిష్యత్ వర్తమానాలను జీవన చిధ్రానికే వినియోగించు కోవటమౌతుంది. ఇక ప్రజా వికాసానికి దారేది?


విశ్వనగర నిర్మాణం ఎవడికి కావాలి? ప్రజోపయోగ శాసనాలు నిర్మించబడిని శాసనసభలున్న రాష్ట్ర రాజధానులు రావణ కాష్టాలకన్నా గొప్పవేమీ కావు. విశ్వనగరాల నిర్మాణం ప్రభుత్వపనిగానేకాడు. అవి కాట్రక్టర్లకు అద్బుత భవితవ్యానికి బాటవేసే పథకరచనలు. ఆంధ్రప్రదేశ్ లో నేడు:




*పంటభూములు మంటగలిశాయి

*కాల్-మని వ్యాప్తితో మహిళలమానం హారతికర్పూరం

*’మహిళా సాధికారత’ ప్రచారార్భాటంగా మిగిలింది 'నగరి మహిళా ప్రజా ప్రతినిధీ సభా సభ్యత్వ అభిశంసన’ తోనే అది ‘సమాది’ అయింది

*పరిపాలన ప్రజల కోసం కాదని బస్సు, కల్తీ, కాల్-మని, భూకబ్జా, విద్యా, వైద్యం, గనులు, అటవీ మొదలైన మాఫియాలకు దోచిపెట్టటానికేని స్వజన, స్వప్రాంత, స్వకుటుంబ పరిరక్షణకేనని ఋజువైంది.

*సభలో మహిళా సభ్యులకు విలువే ఉండని పరిస్థితి లో చంద్రబాబు నాయకత్వం ఒక ప్రతిపక్ష ఎమెలేని సభనుండి బహిష్కరించి పైశాచిక ఆనందం పొందుతుంది.  

*తమ ప్రభుత్వ సం-రక్షణ ఇక్కడ సభాపతి భాధ్యతగా కనిపిస్తుంది. ప్రతిపక్షాన్ని హెచ్చరించి, బెదిరించి, సబా భహిష్కరణ లాంటి కార్యక్రమాలూధికారపార్టీ నాయకుని సంతృప్తి కల్పించటమే ఆయన జీవితాశయంగా కనిపిస్తుంది. ఇక్కడ సౌండ్ ఎక్కువ సరుకు తక్కువ. చట్టం చట్టుబండలే ఈ శాసనసభలో.  

 *ఈ శాసనసభలో సభ్యులు ఒకరు తిడితే మరొకరు రెట్టింపుసార్లు తిడతారు. అవసరమైతే బాహాబాహీకి దిగుతారు. జుట్టూజుట్టూ పీక్కోగలరు. జగన్ మోహన్ రెడ్డిని ఎంత తిడితే అంతగా వారి నాయకుడు సంతృప్తి చెండటమే దీనికి కారణం. "యథా సభాపతి తథా సభ్యులు" ఆయనా శక్తికొలది సభలో ప్రతిపక్షాణ్ణి అణిచేస్తూ వుంటారు.

*ఇక్కడ సభలో ఎవరేం మాట్లాడతారో ఎవరికీ వినిపించదు. ఆఖరికి మాట్లాడిన వారి నోరు ఏం మాట్లాడతారో అదివారి చెవులకు వినిపించదు. అందుకే అధికారపక్షం సమాధానం ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చదివి తెలుసుకోవాలి. ప్రతిపక్షం అడిగిన ప్రశ్నేమిటో తెలుసు కోవాలంటే సాక్షి చదివి తెలుసుకోవాలి. అన్నీ చానల్స్ అధికార పక్షానికి తొత్తులే ఇది బహిరంగ రహస్యం. అలాగే ప్రతిపక్షానికి మాత్రం ఒక్క సాక్షే దిక్కు. అయితే, విమర్శలకోసం వారి వివరాలు వీరి పేపర్లో - వీరి వ్యవహారాలు వారి పేపర్లో చదవాలి.    

*ఇక్కడ నాయకుడు తాను నిప్పని, అనుభవముందని, మహానగరాలు నిర్మించానని సభలో సెల్ప్-డబ్బా కొట్టుకోవటం, సభ వెలుపల వీడియోల్లో "బ్రీఫ్డ్ మి" రూపములో దొరికి ప్రజల అపహస్యానికి గురౌతారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లో అమితంగా దూసుకు పోతూ అమితానందం పొందుతారు, సభలో బాబుగారి సమ్మెట దెబ్బలకు గురౌతుంటారు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు ఒక మహిళా ఎమెలే అధికారపక్షాన్ని తుప్పువదిలేలా వాయించేసేది. అప్పుడు జగన్ కు కొంత ఊరట లభించేది. కాని ఆమెని తట్టుకునే "విషయం" పరిజ్ఞానం  లేని నాయకత్వం తమ అపౌరుష్యాన్ని ఆమెను సభాబహిష్కరణ చెసి ఋజువు చేసుకుంది.

*ఇక్కడ అధికార పార్టీ నాయకుణ్ణి ప్రతిపక్ష నాయకుడు వైస్వెర్సా, సభ్యులు అలానే నువ్వు నువ్వు అంటూ అసభ్యంగా సంభోదించు కుంటారు అలాగే చండాలంగా మాట్లాడుకోవటం దినవారీ పరిణామం. ఇది ఆంధ్రులకు అసహజం. బహుశ విశ్వనగరం అమరావతి కోసం బాహుబలిలో s“కాలకేయుల బాష” లాగా నూతన ఒరవడి సృష్ఠిస్తున్నట్లున్నారు అని అనుకుంటున్నారు యువత.

*నరికేస్తా! చంపేస్తా! కొరికేస్తా! చెరిచేస్తా! అనేవి సహజంగా వినిపిస్తాయి. అది విని సభానాయకుడు, సభాపతి మహా సంతోష పడిపోవటం మనం చూస్తూనే ఉన్నాం. అరేయ్, ఒరేయ్ అనే పదాలను మించి సభ్యసమాజం భరించలేని బూతుభాష వాడేయ్యటం అమరావతిమి ఆ బూతులోనే తదాత్మ్యం చెందమని సందేశం ఇస్తున్నట్లు సభాకార్యక్రమాలు నడుస్తుంటాయి.     

*ప్రతి రోజూ ప్రతిపక్ష నాయకుణ్ణి ఆయన అవినీతినే కాదు ఆయన తండ్రి తాత చరిత్రని కూడా తవ్వుతూ అధికారపక్షం బతికేస్తుంది. ప్రజలకు మేలుచేసే ఉద్దేశమే అధికారపక్షానికి కనిపించదు. ప్రతిపక్ష నాయకుణ్ణి ఊపిరి సలపనివ్వని విధంగా అవమానిస్తారు సహచర సభ్యుడున్న గౌరవం కూడా లేకుండా. అయితే అధికారపక్ష నాయకుడు గతములో ప్రతిపక్షములో ఉన్నప్పుడు చంద్రబాబు స్వంత బామ్మర్దినే నేటి ప్రతిపక్ష నాయకుని తండ్రి ముఖ్యమంత్రిగా కాపాడారన్న కృతజ్ఞత మాత్రం లేనేలేదు. తన పాలనతో ప్రజకు మేలుచేసి గొప్పనాయకుణ్ణని అనిపించుకోకుండా మాటలతో హింసించటం ఈ ముఖ్యమంత్రి విధానం అని ప్రజలకు అర్ధమౌతూనే ఉంది. దీనికి ఏపి శాసనసభే సాక్ష్యం.

*ప్రతిపక్ష సభ్యులను కీర్తి, కనకాలు, ధనం, అవకాశాలు, అవసరాల బలహీనతలను ఉపయోగించుకొని గోడ దూకించటం బహిరంగ రహస్యం. ఆయనపై ప్రజాభిమానం పెరుగుతూనే ఉంది. ఏదేమైనా అధికారపక్షానికి చీకటి కాలం దాపురిస్తుందని విజ్ఞులు చెపుతున్నారు.




కొంచం అటో ఇటో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వాటి శాసనసభల్లో ప్రజాస్వామ్యనికి మంగళం పాడేశారు. దాదాపు ఇలాంటి కథే నడుస్తుంది తెలంగాణా శాసనసభలో కూడా! కాకపోతే కలవకుంట్ల వారి చమత్కారం ఆంధ్రా శాసన సభ అంత వికారంగా లేకుండా నడుస్తుంది.


ఇక్కడ ప్రతిపక్షం పరమ బలహీనం. ప్రతిపక్ష నాయకుణ్ణి ఉబకేస్తే ఉబ్బిపోయేరకం. ఇంకేం తెలంగాణా నాయకత్వం ఆయన్ని ఫుల్లుగా వాడేస్తున్నారు మర్యాద ఒలకబోస్తూ! ఈ ప్రతిపక్ష నాయకుడి కారక్టెర్ మహాభారతం లో శల్యుణ్ణి సుయోధనుడు మచ్చిక చేసుకొని  పొగిడి పడేశాడు. అలాగే కలవకుంట్లవారు జానారెడ్డి గార్ని పెద్దవారు జానారెడ్డి గారని పిలుస్తూ ముందర కాళ్ళకు బంధం వేస్తూ కాలాన్ని నడిపిస్తున్నాడు. కలవకుంట్లవారి చాతుర్యం తో శత్రువుని, విమర్శించిన వారిని చూసీ చూడనట్లు వదిలేస్తారు. దాంతో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే వాగి వాగి అలసి పోయారు. కొన్నాళ్ళకి ప్రజలు కూడా మాయలో మరచిపోతారు.




తెలంగాణా శాసనసభలో తప్పులు జరగవనికాదు - జరిగినప్పుడు సభ్యులు తమంతట తామే క్షమాపణలు కోరతారు. లేకపోతే సభానాయకుడు క్షమాపణలు చెప్పిస్తారు. సభాపతి మాత్రం నిదురిస్తున్నారేమో అనిపిస్తుంటుంది. బహుశ ఇంట్లో వారి మనవలు మనవరాళ్ళు నిద్రపోనివ్వరేమో? లేకపోతే మన తెలంగాణా మౌనముని అనే అవార్డ్ కోరుకుంటున్నారేమో? ఏదేమైనా తెలంగాణా శాసనసభ నుంచి సంస్కారం వెల్లువై పారుతుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: