కేజ్రివాల్ కు షాక్: రూ.97 కోట్లు కట్టవలసిందే





ప్రభుత్వ ప్రకటనలలో కేవలం ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఫొటోలు మాత్రమే ఉండాలని సుప్రీంకోర్టు 2015 లో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనికి విరుద్ధంగా ప్రభుత్వ ప్రకటనలలో కేజ్రీవాల్‌ ఫోటోను ప్రముఖంగా చూపించినందుకు "ఆమ్ ఆద్మీ పార్టీ" నుంచి ఆ ప్రకటనలకైన ఖర్చు మొత్తం రూ.97 కోట్లు వసూలు చేయాలని డిల్లి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంఎం కుట్టి ని కొత్త లెఫ్టినెంట్ జనరల్ అనిల్ బైజల్‌ ఆదేశించారు.



ప్రభుత్వ ప్రకటనలను పార్టీల ప్రచారానికి అరవింద్ కేజ్రివాల్ మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రతి చోటా-మోటా గల్లీల ప్రజా ప్రతినిధులు కూడా నిర్లజ్జగా వాడేసు కుంటున్నారు.  గతములోలాగే లెఫ్టినెంట్ గవర్నర్‌తో దాదాపు ప్రతిరోజూ కొట్లాటలకు దిగిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు నూతన ఎల్‌.జీ. అనిల్ బైజల్‌ తోనూ సమస్యలు, తల నొప్పి తప్పట్లేదు. ఆయన సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఈ ప్రకటనలు ఉల్లంఘించాయని తెలిపారు.






ప్రభుత్వ ప్రకటనలలో ముఖ్యమంత్రుల ఫొటోలు ఉండకూడదని సుప్రీంకోర్టు గతములోనే చెప్పిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. అయితే రూ.97 కోట్లు ప్రణుత్వ ఖజానా నుండి చెల్లించటం వలన తిరిగి ఆ సొమ్ము రాబట్టటానికి ఆం-ఆద్మి-పార్టీకి ఒక నెల రోజుల గడువు ఇచ్చారు. 


అయితే లెఫ్టినెంట్ గవర్నర్ ఇచ్చిన నోటీసులు ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీకి ఇంకా అందినట్లు లేవు. ఇప్పటివరకు ముఖ్యమంత్రికి గానీ, ఉప ముఖ్యమంత్రికి గానీ, పార్టీకి గానీ ఈ నోటీసుల గురించి ఎలాంటి సమాచారం కూడా లేదని, తమకు ఏమైనా సమాచారం వస్తే తప్ప, ఈ విషయం పై వ్యాఖ్యానించలేమని ఆం-ఆద్మి-పార్టీ వర్గాలు అంటున్నాయి. 


ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని అటు కేంద్ర ప్రభుత్వం, అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కర్ణాటక సుప్రీంకోర్టును ఇప్పటికే ఆశ్రయించాయి. దీని వల్ల దేశంలో సమాఖ్య స్పూర్తికి ముప్పు కలుగుతుందని అవి వాదించాయి. దాంతో గత సంవత్సరం మార్చిలో సుప్రీంకోర్టు తన తుది ఉత్తర్వులను వాయిదా వేసింది. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రుల ఫొటోలను కూడా అనుమతిస్తామని చెప్పింది. అయితే తుది తీర్పు ఇంకా రావలసి ఉంది. 


అయితే మన రెండు తెలుగు రాష్త్రాల్లో ముఖ్యమంత్రులు (ఇతర మంత్రులు ప్రజాప్రతినిధులు ) విచ్చల విడిగా వారికే చెందిన స్వంత పత్రికల్లో ప్రకటనలు జారీ చేస్తూ ప్రభుత్వ ఖజానాను వారి స్వంత మీడియా సంస్థలకు దోచి పెడుతున్నారు. మిగిలిన వాళ్ళకు ఏదో నామమాత్రం ప్రకటనలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రకటనల్లో ప్రభుత్వం కాకుండా వారే ప్రజలకు మేలు చేస్తున్నట్లు చూపిస్తూ విపరీత ప్రచారార్భాటాలకు పోతున్నారు. అంతే కాకుండా ప్రకటనలను తమ ప్రతిపక్ష మీడియాలకు ఇవ్వకుండా వారిని తమ అదుపాజ్ఞల్లో ఉంచుకోవటానికి వాడు కోవటం చూస్తూనే ఉన్నాం.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: