బీటలు వారుతున్న అధికార పార్టీ కోటలు: కూలిపోతున్న ప్రజల ఆశలు






బీజేపీని ఓడించడానికి బద్ధశత్రువులైన జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కలిశాయి. బిహార్‌లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేఖంగా ముప్పిరిగొని ప్రచారం చేశారు. అనుకున్నట్లే బ్రహ్మాండమైన మెజారిటీ సాధించి అధికారాన్ని చేపట్టాయి. నితీష్‌కుమార్‌ను ముఖ్యమంత్రిగాను, ఆర్జేడీ అధినేత లాలు కుమారుల్లో ఒకరైన తేజస్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగాను, అలాగే ఆరోగ్య శాఖా మంత్రిగా మరొ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసారు. 



అటు లాలూ కోరిక తీరింది. ఇటు నేపధ్యములో అధికారం లాలూ ప్రసాద్ ఆధీనం లోనే ఉంది. అయితే అంతవరకు అంతా బాగానే ఉన్నట్లు కనిపించింది గానీ, గడిచిన ఒక్క ఏడాది లోనే అధికార కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి అంతే కాదు ఈ లుకలుకలే తారస్థాయికి చేరుకొని పార్టీల కోటలకే కాదు, సర్కారు గోడలకు బీటలు వారుతున్నాయి. ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చిన పెద్ద నష్టం ఏమీ లేకపోయినా ఇదే పరిస్థితులు కొనసాగితే మాత్రం ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నాళ్లు నిలబడుతుందో అనేది అనుమానాస్పదమే అంటున్నారు. 





అధికార పార్టీ జేడీ (యూ) సభ్యుడు, మాజీ అధికార ప్రతినిధి డాక్టర్ అజయ్ అలోక్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి మంద గమనానికి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని ట్విట్టర్‌లో మండిపడ్డారు. రాష్ట్రంలోని 182 ప్రాజెక్టు ల మీద ఇప్పటివరకు ఒక్కపైసా కూడా ఖర్చుపెట్టలేదని, దానివల్ల రూ. 11 వేల కోట్ల నిధులు వృథా అయ్యాయని వ్యాఖ్యా నించారు.




కాంగ్రెస్, ఆర్జేడీలకు చెందిన మంత్రులే ఈ రెండు శాఖలను చూస్తున్నందున, ఆ పార్టీలే ఇందుకు బాధ్యత వహించాల న్నట్లుగా డాక్టర్ అజయ్ అలోక్ వ్యాఖ్యానించారు. తప్పు చేసింది ఆ రెండు పార్టీలయితే అభివృద్ధి జరగకపోవడానికి ముఖ్య మంత్రి నితీష్ కుమార్‌ ను తప్పుబడుతున్నారని ఆయన అన్నారు. కాగ్ నివేదికలో ఈ అంశాలను వివరంగా పేర్కొన్నారని ఆయన చెప్పారు. 


పన్ను వసూళ్లలో బిహార్ 22% గత సంవత్సరం కంటే వృద్ధి నమోదు చేసిందని, ఇది దేశంలోనే అత్యధికమని తెలిపారు. ఆయన పాత్రలేని చోట్ల జరిగిన వైఫల్యాలకు కూడా ఆయన్ని బాధ్యుణ్ణి చేస్తున్నారని, దీనిపై తాను ఆందోళన వ్యక్తం చేశానని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: