బాబు దేశంలోనే నెంబర్ వన్ సీఎం.. ఎందులోనో తెలుసా..!?

Chakravarthi Kalyan
చంద్రబాబు ఒకవైపు తన చేతికి వాచీ లేదు.. అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎం అని జాతీయ మీడియా తేల్చింది. ముఖ్యమంత్రులు, ఆస్తులు, వారిపై ఉన్న నేరాభియోగాలు.. వంటి అంశాలపై అధ్యయనం చేసిన ఇండియాటుడే.. అందుకు సంబంధించిన గణాంకాలను వెల్లడించింది. 


ఆస్తుల విషయంలో.. తాను నిరుపేదను అని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ జాబితాలో తొలి స్థానం దక్కడం విశేషం. అది బాబు ఆస్తులు కొంతమంది వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే.. కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం. వ్యక్తిగతంగా 177 కోట్ల రూపాయల ఆస్తులతో చంద్రబాబు నాయుడు అత్యంత ధనికుడైన సీఎంగా నిలుస్తాడని ఇండియాటుడే పేర్కొంది. 


ఈ జాబితాలో 129 కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు అరుణాచల్ ప్రదేశ్ సీఎం. మరి రెండో స్థానంలో ఉన్న వ్యక్తి కన్నా బాబు ఆస్తులు దాదాపు 48 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇటీవలే పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కెప్టెన్ అమరీందర్ సింగ్ మూడో స్థానంలో, హిమచల్ సీఎం నాలుగో స్థానంలో ఉండగా.. ఐదో స్థానంలో కూడా తెలుగు రాష్ట్ర సీఎం ఉండటం విశేషం. 



15 కోట్ల రూపాయల ఆస్తులతో కేసీఆర్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు. కేసీఆర్ ఆస్తులతో పోలిస్తే చంద్రబాబు ఆస్తులు దాదాపు పన్నెండు రెట్లు ఎక్కువ! కేవలం వ్యక్తిగతంగా వందల కోట్లను పోగేసుకున్న వాళ్లే కాదు.. దేశంలో నిరుపేద సీఎంలు కూడా ఉన్నారు. వారిలో ముందున్నారు త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్. అత్యంత నిజాయితీ పరుడిగా పేరు పొందిన ఈ కమ్యూనిస్టు పార్టీ లీడర్ ఆస్తులు కేవలం 26 లక్షల రూపాయలు మాత్రమే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: