శశికళ వారసుడు దినకరన్ కు డిల్లి పోలీసులు లుక్ అవుట్ నోటీసులు?





తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్న లంచం కేసులో అన్నా డి.ఎమ్.కె. ఉప కార్యదర్శి పార్టి నేత టి టి వి దినకరన్ అరెస్టు కు రంగం సిద్దం అవుతోందన్న సమాచారం వస్తోంది. దీన్ని బట్టి ముందుగా బెయిల్ పొందటానికి దినకరన్ తన ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్లు సమాచారం అందుతుంది. డిల్లీ కదనాలను బట్టి చూస్తే దినకరన్ ఈ కేసులో తప్పనిసరిగా బుక్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.అన్నా-డి.ఎమ్.కె. ఎన్నికల గుర్తు రెండు ఆకుల కోసం ఎన్నికల సంఘానికి ఏభై కోట్ల రూపాయలు లంచం ఇవ్వడానికి దినకరన్ సిద్దమయ్యారన్న వారతలు సంచలనం సృష్టిన విషయం తెలిసిందే.


ఈ కేసులో అరెస్టు అయిన సుఖేష్ చంద్రశేఖర్ ఎవరో తనకు తెలియదని దినకరన్ ఖండించినా భుఖాయించినా, తమ వద్ద తగిన ఆదారాలు ఉన్నాయని డిల్లీ పోలీసులు చెపు తున్నారు. తగిన ఆధారాలు ఉన్నందునే దినకరన్‌పై మూడు సెక్షన్లలో కేసు నమోదు చేశామని వారంటున్నారు. సుకేష్, దినకరన్‌కు మద్య ఎంతోకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అనేక సార్లు వారు కలుసుకుని మాట్లాడుకున్నారని పోలీసులు తెలిపారు. 


ఈ పరిచయం తోనే దినకరన్‌ సుకేష్‌ తో బేరం కుదుర్చుకున్నాడని, దానికి తగ్గట్లు ఢిల్లీ లోని చాందినీ చౌక్‌ ప్రాంతానికి చెందిన ఒక హవాలా ఏజెంటు ద్వారా రూ.10 కోట్ల రూపాయలు సుకేష్‌కు అందజేయబడ్డాయని పోలీసులు ఘంటాపధంగా చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారి మద్య జరిగిన సెల్-ఫోన్ సంభాషణలను కూడా జరిగిన విషయం కనుగొన్నట్లు చెబుతున్నారు. వీటిని దృష్ఠి లో పెట్టుకునే దినకరన్ ను కలుసుకోవడానికి బెంగుళూరు పరపాణ జైలులో ఉన్న శశికళ నిరాకరించడం విశేషం.





ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయిన దినకరన్‌ కు మరో షాక్‌. ఆయనకు ఢిల్లీ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు ముందస్తుగా "లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు" అని వార్తలు వస్తున్నాయి. దినకరన్‌ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందన్న అను మానంతో ఆయన ఇతర రాష్ట్రాలు, దేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకు దేశంలోని ప్రధాన విమానాశ్రయాలకు "లుక్‌అవుట్‌ నోటీసులు" ఇప్పటికే జారీ చేశారు.


ఈ కేసు విచారణ జరుపుతున్న ఢిల్లీ పోలీస్‌ అధికారి ఒకరు మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల సంఘానికి కి లంచం ఇవ్వ జూపిన కేసులో తమ వద్ద తగినన్ని ఆధారాలు ఉన్నాయని దినకరన్‌ ను అరెస్ట్‌ చేస్తామని, ఇప్పటికే విచారణ నిమిత్తం సమన్లు జారీ చేశామన్నారు. అలాగే దినకరన్‌ తో సుకేష్ చంద్రశేఖర్‌ కు ఉన్న సంబంధాలపై తాము నిశితంగా ఆరాతీస్తు న్నట్లు చెప్పారు. దానికి ఇప్పటికే తగినన్ని అధారాలు లభించినట్లు, సుకేష్ ను అరెస్ట్‌ చేసిన రోజు కూడా అతడు, దినకరన్‌ తో ఫోన్‌లో మాట్లాడి నట్లు గుర్తించా మన్నారు. సుకేష్ కు గత నాలుగేళ్లుగా దినకరన్‌ బాగా తెలుసని తమ విచారణలో వెల్లడైనదని అన్నారు. వీరిద్దరు పలు సందర్భాల్లో కలుసుకున్నారన్నారు.





కాగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడం వల్ల కోల్పోయిన రెండాకుల చిహ్నాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీటీవీ దినకరన్‌ చేసిన ప్రయత్నాలు ఆయనను నిందితుడిగా మార్చిన విషయం తెలిసిందే. ఎన్నికల కమిషన్‌కు రూ.50 కోట్లు లంచం ఇవ్వ డం ద్వారా రెండాకుల చిహ్నాన్ని తిరిగి పొందడం కోసం కర్ణాటకకు చెందిన సుకేష్ చంద్రశేఖర్‌ అనేబ్రోకర్‌ను ఆశ్రయించడం  అతడిని ఢిల్లీ పోలీసులకు సోమవారం పట్టుబడడం తో దినకరన్‌ బండారం బట్ట బయలైంది. దినకరన్‌ ఇచ్చాడని చెబుతున్న రూ.1.30 కోట్లను సుకేష్‌ గది నుంచే  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


దినకరన్‌ను విచారించేందుకు అనుమతి పొందిన ఢిల్లీ పోలీసులు చెన్నైకి వచ్చి ఆయనను ఏక్షణమైనా అరెస్ట్‌ చేస్తారనే ప్రచారం జరిగింది. ఢిల్లీ పోలీసులు సుకేష్‌ను వెంట పెట్టుకుని బుధ, గురువారాల్లో చెన్నైకి చేరుకుంటారని తెలుస్తున్న నేపథ్యంలో దినకరన్‌ తన న్యాయవాదులతో మంగళవారం సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు  "లుక్‌ అవుట్‌ నోటీసులు" జారీ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: