పాత గాంధీ స్టాంపులకు వేలంలో అన్ని కోట్లా..!?

Chakravarthi Kalyan
ఓల్డ్ ఈ గోల్డ్ అన్నారు పెద్దలు.. ఆ సామెత ఇప్పుడు అక్షరాలా నిజమవుతోంది. కొన్ని పాతవైన అపురూప వస్తువులకు అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. తాజాగా మహాత్మగాంధీ బొమ్మ ఉన్న నాలుగు స్టాంప్ లతో కూడిన సెట్లు బ్రిటన్ లో జరిగిన ఒక వేలంలో కళ్లు తిరిగే ధరకు అమ్ముడై అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 


మహాత్మాగాంధీ నాలుగు స్టాంపుల సెట్టు ఏకంగా 5 లక్షల పౌండ్ల ధర పలికింది. మన ఇండియన్ కరెన్సీలో దీని విలువ సుమారు 4 కోట్ల 14 లక్షల రూపాయలు. ఇప్పటివరకూ ఒక వేలంలో ఇండియన్  స్టాంప్ లకు లభించిన అత్యధిక ధర ఇదేనట. ఈ స్టాంపుల తయారీ వెనుక చారిత్రక నేపథ్యం ఉంది. భారత్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1948లో ఈ స్టాంపులు ముద్రించారు. 


మహాత్మా గాంధీ 1948 జనవరి 30న నాధూరామ్ గాడ్సే చేతిలో హత్య చేయబడిన సంగతి తెలిసిందే. ఆ హత్య జరిగిన కొన్నాళ్లకే ఈ స్టాంపులు విడుదల అయ్యాయి. ఇవి  ఒక్కొక్కటి 10 రూపాయల విలువ కలిగినవి. ఈ స్టాంపులను ఆనాటి గవర్నర్  జనరల్ సెక్రటేరియట్ విడుదల చేసింది. ఊదారంగు, గోధుమరంగులో ఉన్న ఈ స్టాంప్ లను వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ఓ  ఇన్వెస్టర్ కొనుక్కున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: