భారత్ కు డ్రాగన్ చైనా వార్నింగ్

Chinese dragons traditionally symbolize potent and auspicious powers, particularly control over water, rainfall, typhoons, and floods. The dragon is also a symbol of power, strength, and good luck for people who are worthy of it.







బుసగొట్టటం పాము నైజం. ఆ గుణాలే పుణికి పుచ్చుకున్న దేశం చైనా.  అందుకే దాని జాతీయ చిహ్నంగా డ్రాగన్ నే ఎంచు కుంది. సాధారణంగా ప్రజాస్వామ్యపాలన అంటే ఇష్టం లేని చైనా లాంటి దేశానికి తన నియంతృత్వమే పరమార్ధంగా కని పిస్తుంది.


 
దలైలామాను అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించేందుకు అనుమతించడం వల్ల భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్ప దంటూ, భారత్‌పై డ్రాగన్‌ మరోసారి బుసలు కొట్టింది. తన నియంత్రణలో ఉండే తన ప్రభుత్వ మీడియాతో చైనా , భారత్ కు హెచ్చరికల తో కూడిన బెదిరింపులు చేయించింది. దలైలామా పర్యటనకు ప్రతిస్పంధనగానే అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాల పేర్లను తమ భాషలో పేర్లు మార్చినట్టు సంకేతాలు ఇచ్చింది.




అరుణాచల్‌ ప్రదేశ్ తమదేనని, దక్షిణ టిబేట్‌లో భాగమైనని వాదిస్తున్న చైనా ఇప్పుడు ఆ రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల పేర్లను మారుస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ ప్రకటనను "అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రతి అంగుళం కూడా తమదే" నని భారత్‌ తీవ్రంగా ఖండిస్తూ,  "స్పష్టం చేసింది" 


ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వాదీన, జాతీయవాద పత్రిక  "గ్లోబల్‌ టైమ్స్‌" ఎప్పటిలాగే స్పందిస్తూ, "చైనా ఇప్పుడు దక్షిణ టిబేట్‌ లోని పేర్లను ఎందుకు ప్రామాణీకరించిందో భారత్‌ ఓసారి తీవ్రంగా ఆలోచించుకోవాలి అంటూ, దలైలామాను వాడుకోవడం భారత్‌కు సరైన చాయిస్‌ కాదు. ఒకవేళ భారత్‌ ఇదే ఆటను కొనసాగించదలుచుకుంటే, ఆ దేశానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది"  అని వ్యాఖ్యానించింది. 





అంతే కాకుండా "భారత్‌ కంటే చైనా బలమైన దేశమని, ఒకవేళ ఏ దేశం బలంగా ఉందో చూడాలని భావిస్తే, సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి చైనా, చర్చల జోలికి రానే రాదని"  నిష్కర్షగా, నిర్ద్వందంగా చెప్పింది. అంతే కాకుండా చైనా తాజా చర్యలను ప్రతీకార చర్యలుగా అభివర్ణిస్తూ భారత మీడియా కథనాలు రాసిందని, ఇది అసంబద్ధమైనది"  అంటూ  విషం కక్కింది అచ్చం డ్రాగన్లాగే.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: