లోకేశ్ తీరుతో మళ్లీ తలపట్టుకున్న బాబు.. మోడీకి కోపం వస్తుందేమో..!?

Chakravarthi Kalyan
నారా లోకేశ్ కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. మొదటి ఎమ్మెల్సీగా ఎన్నికవడం.. ఆ తర్వాత ఏకంగా మంత్రి కావడం.. ఆ తర్వాత వరుసగా తప్పులు మాట్లాడుతూ కెమేరా ముందు దొరికిపోవడం.. ఇలా వరుస ఘటనలతో లోకేశ్ పై పుంఖానుపుంఖాలుగా సెటైర్లు వెల్లువెత్తాయి. ఆ విమర్శలు తట్టుకోలేక ఏకంగా పొలిటికల్ పంచ్ పై కేసు పెట్టి అరెస్టు చేయించిన సంగతి తెలిసిందే. 



ఐతే.. అదంతా లోకేశ్ ప్రసంగంలో తొట్రుపాటు వల్ల వచ్చిన కామెడీ.. పాపం లోకేశ్ కు ఆ తడబాటు మొదటి నుంచి ఉంది.. ఇప్పుడు వరుస ఘటనలతో లోకేశ్ సోషల్ మీడియాలో ఓ జోకర్ లా తయారవుతున్న ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు లోకేశ్ తడబాటుతోనే కాదు.. క్లారిటీ లేకపోవడం వల్ల కూడా వివాదాలకు కారణం అవుతున్నాడు. 



చిన్నాచితకా విషయం గురించి కాదు.. అత్యంత కీలకమైన జమిలి ఎన్నికల విషయంలోనూ లోకేశ్ కు క్లారిటీ మిస్సవడం ఇప్పుడు మరో టాపిక్ అయ్యింది. ఇటీవల చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు రెడీ కావాలని పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. దాన్ని మీడియా అంతా ఫోకస్ చేసింది. దాన్ని టీడీపీ కూడా ఖండించలేదు. అంటే బాబు ఎన్నికలకు రెడీ అవుతున్నాడన్నమాట. 



ఈ సమయంలో...  అబ్బే మా నాన్న ముందస్తు గురించి మాట్లాడలేదు. అసలు ఓ ఏడాది ముందే అంటే ఎన్నికలకు ఎవరు ఒప్పుకుంటారు. అస్సలు ఒప్పుకోరు.. అసలు జమిలి ఎన్నికలే అసాధ్యం అంటూ లోకేశ్ తాజాగా కామెంట్ చేశారు. దీంతో చంద్రబాబు తలపట్టుకున్నారట. ఒకే దేశం, ఒకే ఎన్నిక నినాదం ఆచరణ సాధ్యం కాదని లోకేష్ వ్యాఖ్యానించిన ఒక్కరోజులోనే చంద్రబాబు నాయుడు జమిలి ఎన్నికలను స్వాగతం చెబుతున్నానని కామెంట్ చేశారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అని, జాతీయ పార్టీలకు ఉపయోగమన్న వాదన సరికాదన్నారు. బాబు వాదన లోకేశ్ వల్ల జరిగిన డ్యామేజీని చంద్రబాబు ఇలా కవర్ చేస్తున్నారన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: