ట్రిపుల్ తలాక్ ను రాజకీయ కోణంలో చూడవద్దు : ప్రధాని మోడీ గళం






ముస్లిం సమాజములో మహిళలు చాలా విషయము లో వెనుకబడి నిర్లక్ష్యానికి గురౌతున్నట్లు అవగతమౌతుంది. మూడుసార్లు తలాక్ అంటే వారి వివాహబందం ముగిసి పోతుంది. వారి జీవితం వారి ఆశలు వారి ఊహలు మద్యలోనే అణగారి పోవటం అనేక సార్లు ఆ సమాజ మహిళల నుండే వినిపిస్తూ వస్తుంది. దీన్ని సామాజిక కోణం నుంచి చూడటం ఎంతో అవసరం. రాజకీయ కోణములో చూడటం అవివేకం. అదే విషయాన్ని ఆయన ముస్లిం సంస్కరణ వాదులు స్వచ్చందంగా ముందుకురావాలనే అభిప్రాయపడ్డారు.





ట్రిపుల్ తలాక్‌పై రాజకీయం చేయొద్దని ప్రధాని నరేంద్ర మోదీ ముస్లిం పెద్దలను కోరారు. దీనికి పరిష్కారం కనిపెట్టేందుకు ముస్లిం సంస్కరణ వాదులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అభ్యర్థించారు. ట్రిపుల్ తలాక్‌కు ముస్లిం మహిళలు వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్న ఆయన, వారికి జరుగుతున్న అన్యాయంపై మరింత స్వరం పెంచుతానన్నారు. శనివారం భువనేశ్వర్‌లో కన్నడ తత్వవేత్త బసవన్న జయంతి సందర్భంగా ఆయన పాల్గొని ప్రసంగించారు.


 
"దేశంలోని ముస్లిం ఆడబిడ్డల వెతలపై పోరాటం చేస్తా, కాలం చెల్లిన ట్రిపుల్ తలాక్ చట్టానికి మా ప్రభుత్వం ముగింపు పలుకుతుంది" అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మిగతా ముస్లిం మహిళల మాదిరిగానే భారత దేశంలోని ముస్లింలను కూడా ఆధునిక పథంలో నడిపించగలనని ఆశాభావం వ్యక్తం చేశారు. 40 నిమిషాల పాటు సాగిన ఆయన ప్రసంగం లో మహిళా సాధికారత, సమానత్వం, సుపరిపాలనపై ప్రత్యేకంగా ప్రస్తావించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: