ఏపి శాసనసభ స్పీకర్ కొడుకు కూడా ఒక దొంగతనం కేసులో నిందితుడా?





తెలుగు దేశం పార్టీలో నాయకుల పుత్రుల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. అంతే కాకుండా వారి పాపాలను తప్పిదాల ను అధికారులు దాచిపెట్టటానికి తప్పించ టానికి ప్రయత్నించటం జరుగుతుందని అనేకసార్లు అది బయటపడుతూనే ఉండి. అయినా జరగాల్సిన పాపాలు జరిగి పోతూనే ఉన్నాయంటున్నారు గుంటూరువాసులు. ఇప్పుడు హైకోర్టు ఆదేశాల అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనస్భ సభాధిపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు కుమారుడు డాక్టర్‌ కోడెల శివరామకృష్ణతో పాటు మరికొందరిపై పోలీసులు చోరీ కేసు నమోదుచేశారు. 


ఈనెల 13 వ తేదీనే కేసు నమోదు చేసిన పోలీసులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. కేసు వివరాలు, గుంటూరు జిల్లా నరసరావుపేట లో "నల్లపాటి కేబుల్‌ విజన్‌" (ఎన్‌సీవీ) కేబుల్‌ వైర్లను కె.చానల్‌ నిర్వాహకుడు డాక్టర్‌ కోడెల శివరామకృష్ణ, అతడి అనుచరులు ప్రకాష్‌ నగర్, పెద్దచెరువు ప్రాంతాల్లో గతేడాది మార్చి 17న ధ్వంసం చేసి డ్రమ్ములు, యాంప్లిఫయర్లను అపహరించారు.



Kodela Siva Prasad's daughter Dr. Vijayalakshmi is now into the news for land grabbing case.



ఈ సంఘటనపై "ఎన్‌సీవీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కోటేశ్వరరావు" ఒన్‌ టౌన్, టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు వాట్సాప్‌ మెసేజ్‌ల ద్వారా ఫిర్యాదును ఉన్నతా ధికారులకు పంపారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడం తో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు జిల్లా రూరల్‌ ఎస్పీ, డీఎస్పీ, ఒన్‌ టౌన్, టు టౌన్‌ సీఐలను ఈనెల ఆరో తేదీ న కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు హాజరైన అధికారులు కేసు నమోదు చేయనందుకు కోర్టుకు క్షమా పణ చెప్పారు. అధికారుల నిర్లక్ష్యంపై చార్జి మెమో ఇచ్చినట్టు రూరల్‌ ఎస్పీ కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయస్థానం కేసు నమోదు చేసి, నిర్వహించిన దర్యాప్తును మే 9వ తేదీన తనకు నివేదించాలని ఎస్పీని ఆదేశించింది.


ఇదంతా రాష్ట్రంలో సాగిపోతున్న నిరంకుశపాలనకు సాక్ష్యమని తండ్రి సభాపతి, కొడుకు చోరుడు అయి ఉండీ తమ నియోజక వర్గం పరువు తీస్తున్నారని చివరకు కొడుకు దిగజారి చోరీకి పాల్పడటం సిగ్గుగా ఉందని జనం గగ్గోలు పెడుతున్నారు. వీళ్ళ పాపాలను పోలీసులు సైతం కప్పి పెట్టటం విచారకరమని అంటున్నారు. న్యాయస్థానం కలగ చేసుకోపోతే అధికారులు నాయ కులు కుమ్మక్కై ప్రజా సంపదల నేకాదు జాతి సంపదలను నిరాటంకంగా దేచేయటములో విజయం సాధించారనటం లో అనుమానం లేదంటున్నారు. 




సభాపతి అయిన డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబం కోడల్ని వేదించిన సందర్భమూ ఉందని, అలాగే ఎన్నికల్లో 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు పబ్లిక్ లో నిర్భయంగా సిగ్గులేకుండా చెప్పిన విషయం పై కేసులున్నాయని ఇలాంటి వాళ్ళ నాయకత్వంలో రాష్ట్ర పాలన నడవటం జాతికి సిగ్గుచేటని ప్రజలు భావిస్తున్నారు. 


చంద్రబాబు పాలనలో మంత్రులు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యుల సుపుత్రులే దురాగతాలకు, దౌర్జన్యాలకు పాల్ప డటంతో, అమరావతి రాజధానిగా రాష్ట్రం పురోభి వృద్దిలోకి ఎలా ప్రయాణిస్తుందనే అనుమానం పెనుభూతమై జనాన్ని పట్టి పీడిస్తుంది. ఈ రాష్ట్ర భవితవ్యం పూర్తిగా అనుమానాస్పదమే అంటున్నారు. రావెల, బొండా, నిమ్మల, కోడెల కుమార రత్నాలే కాదు,  ఇంకా చాలమంది నాయకుల కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని నిరాఘాటంగా దోచేస్తున్నారని ప్రజలు వ్యధ చెందు తున్నారు. రాష్ట్రాన్ని దిక్కూ దివాణం లేకుండా చెయటాన్ని జనం భరించలేక పోతున్నారు. కూతురుతో సహా మొత్తం కోడెల కుంటుంబమే నేరాలతో వర్దిల్లుతున్నారట 




AP Assembly Speakar Kodela Siva Prasad Daughter In Law Padma Priya Press Meet

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: