ఒలంపిక్స్ లో మెరిసిన మహిళలు

HANUMA HANUMA
 లండన్ ఒలంపిక్స్ లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు మహిళా క్రీడాకారులు సైనానెహ్వాల్, మేరీకామ్ లు. బాడ్మింటన్, బాక్సింగ్ విభాగాల్లో భారత్ కు కాంస్య పతకాలు సాధించి రికార్డులు సృష్టించారు. భారీ అంచనాలు, ఎన్నో ఆశలతో ఒలంపిక్స్ బరిలోకి దిగిన ప్రముఖ క్రీడాకారులు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచారు. పతకాల వేటలో చతికిల పడ్డారు. అయితే, మహిళామణులు మాత్రం ఒలంపిక్స్ వేదికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి భారత ప్రతిష్టను నిలబెట్టారు. హైదరాబాద్ కు చెందిన బాడ్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్ తొలిసారిగా భారతదేశానికి బాడ్మింటన్ లో కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మహిళల విభాగంలో తొలిసారి ప్రవేశ పెట్టిన బాక్సింగ్ లో కూడా మహిళా బాక్సర్ మేరీకామ్ కాంస్య పతకం సాధించి రికార్డు సృష్టించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: