భారత్ లోనే అత్యంత పొడవైన బ్రహ్మపుత్ర వారధి ప్రారంభోత్సవానికి సిద్ధం



60 టన్నుల యుద్ధ టంకును అతి సునాయాసంగా మోసుకుని తీసుకెళ్ళగల బలమైన నదీ వారధి (రివర్  బ్రిడ్జ్ ) ప్రారంభోత్స వానికి సిద్దమౌతుంది. ఇది భారత్ లో అత్యంత పొడవైన బ్రిడ్జ్. దీని వన్తెన పొడవు 9.15 కిలోమీటర్లు! దీనితో భారత సరిహద్దు ల్లోని ఈశాన్య భారతంలో రక్షణను పటిష్టం చేయడంతోపాటు, ప్రజానీకం అవసరాలకు ఉపయోగపడేలా ఈ బ్రిడ్జిని అసోం లోని బ్రహ్మపుత్ర నదిపై "దోలా-సాధియా" ప్రాంతాలను కలుపుతూ నిర్మించారు. 


బ్రహ్మపుత్ర ఉధృతిని తట్టుకుని, 60 టన్నుల యుద్ధ ట్యాంకులను దీనిపై నడిపినా చెక్కు చెదరని ధృడత్వం తో నిర్మించిన ఈ బ్రిడ్జి ని ఈ నెల 26న మన ప్రధాని నరెంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు. చైనా సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ వంతెనను రూ.950 కోట్ల వ్యయంతో 2011లో ప్రారంభించారు. ప్రస్తుతం పనులు పూర్తయి ప్రారంభోత్స వానికి సిద్ధంగా ఉంది.


బహుళార్ధ సాధక ప్రయొజనాలను ధృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా చైనా-భారత్ సరిహద్దు పఠిష్టత - అరుణాచల్ అసోంల మధ్య ప్రజల వాయు, జల, భూ ప్రయాణాల అవ సరాలు తీర్చటానికి ఈ ప్రోజెక్ట్ ఉద్దేశించబడింది. అన్నిటిని మించి సైనిక దేశ రక్షణ అవసరాలతో ఈ వారది ముడిపడి ఉన్నది.  


గతంలో 3.5 కి.మీ. పోడవైన ముంబాయి లోని "బాంద్రా-వొర్లి" సముద్ర అనుసంధాన వారదే భారత్ లో అరి పొవవైన బ్రిడ్జ్. ఈశాన్య భారతం లోని సరిహద్దుల వద్ద రహదారి అనుసంధానాన్ని ధృడ పరచి దేశ రక్షణకు ఊతమిచ్చే నిమిత్తమే ఈ వారది నిర్మాణమని అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ పి.టి.ఐ వార్తా సంస్థకు తెలిపారు.  



ప్రధాని  ఎన్డీఏ ప్రభుత్వం మూడు సంవత్సరాల విజయవంతమైన పాలన పూర్తైన సందర్భంగా ఈశాన్య భారతంలో ప్రారంభంకానున్న ఉత్సవాలలో ఈ ప్రతిష్ఠాత్మక వారది జాతికి అంకితం చేసే కార్యక్రమం కూడా జరగనున్నది. 


ఈ వారధి అసోం రాజధాని దిష్పూర్ కు 540 కి.మి దూరం లోనూ అరుణాచల్ రాజషాని ఇటానగర్ కు 300 కి.మీ దూరములోను సరిగ్గా చైనా సరిహద్దుకు 100 కి.మీ దూరంలో నిర్మించబడి సమస్యాత్మక సంక్లిష్ట సమయాల్లో సైనికుల ఆర్టిల్లరీ ఆయుధాల చేరవేతకు ఉపయోగ పడనుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: