రేపిస్టుల నరాలు కోసెయ్యాలి.. అదొక్కటే సమస్యకు పరిష్కారం: స్వాతి

Shyam Rao

అత్యాచారాలకు అడ్డుకట్ట వేయాలంటే రేపిస్టుల నరాలు కోసేయాలంటూ ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) అధ్యక్షురాలు స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. గుర్గ్రామ్ లో సిక్కిం రాష్ట్రానికి చెందిన యువతిపై కదిలే కారులో ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటనపై ఆమె స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రతి నిమిషాని​కి ఒక రేప్‌ జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.



ప్రతి రేపిస్టుకి మరణశిక్ష విధించడం ద్వారా జాతికి భారత ప్రభుత్వం గట్టి సందేశం పంపించాల్సిన సమయం ఆసన్నమైంది. కఠిన శిక్షలు అమలు చేయడం ద్వారా మాత్రమే మహిళలపై దారుణాలకు అడ్డుకట్ట పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా సత్వరమే న్యాయం అందించి రేపిస్టులకు మరణశిక్ష అమలు చేయడమే సముచితమని స్వాతి మలివాల్ చెప్పారు. కాగా, హార్యానాలో రోహతక్ జిల్లాలో శనివారం నాడు 23 ఏళ్ళ యువతిపై గ్యాంగ్ రేప్ చేసి హత్యచేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.



మరి కొంత మంది రాజకీయ, వ్యాపార వారసత్వానికి సంబంధించిన యువకులు మద్యం మత్తులో ఎంతో మంది అమ్మాయిలను రేప్ చేయడం జరుగుతుంది. కానీ వీటిలో కొన్ని కేసులు మాత్రమే కోర్టు మెట్లు ఎక్కుతున్నాయు. వీటిలో దాదాపుగా అన్నీ పోలీస్ స్టేషన్ ఆవరణలో పరిష్కరించ బడుతున్నవే. కారణం రాజకీయ అండదండలు, రెప చేసిన యువతి కుటుంబాన్ని డబ్బు ద్వారానో, బెదిరింపుల ద్వారానో పరిష్కరించుకోవడమే. దీనికి పోలీసుల వత్తాసు కూడా తోడవుతుంది. కారణం వారి వాటా వారికి అందుతుంది కాబట్టి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: