సీఎం కుమారుడికి ఐదేళ్లు జైలు శిక్ష..!

Edari Rama Krishna
భారత దేశంలో చట్టం ఎవరి చుట్టం కాదని మరోసారి రుజువైంది.  ఈ మద్య సెలబ్రెటీలు, పొలిటీషన్స్, పారిశ్రామిక వేత్తల సంతానం రోడ్డుపై కార్లు, బైకులు అత్యంత వేగంగా నడుపుతూ వారు చావడమో..లేదా ఎదుటి వారిని చంపడమో జరుగుతుంది.  ఓ వైపు దేశంలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్నో కఠిన నియమ నిబంధనలు ఏర్పాటు చేస్తుంటే...ధనికుల పిల్లలు వారి పలుకుబడి ఉపయోగించుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.  తాజాగా ఓ సీఎం కేవలం తనను ఓవర్ టేక్ చేశాడని కోపంతో అతన్ని వెంటాడి వెండటాడి కాల్చి చంపాడు.  

వివరాల్లోకి వెళితే.. మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ కుమారుడు అజయ్‌ మితయ్‌ 2011 మార్చి 20న ఇరోమ్‌ రోజర్‌ అనే వ్యక్తితో కారు విషయంలో గొడవపడ్డాడు.  రోజర్‌ తన కారులో ముందు వెళ్తుండగా.. అజయ్‌ తన ఎస్‌యూవీతో ఓవర్‌టేక్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే రోజర్‌ పక్కకు తప్పుకోకపోవడంతో ఆగ్రహానికి గురైన అజయ్‌.. కారును రోజర్‌ వాహనం ముందు ఆపి.. అతడిపై కాల్పులు జరిపాడు.  దీంతో సీఎం కుమారుడిపై కేసు నమోదు అయ్యింది.    

రోజర్ తల్లి ఇరోమ్ చిత్రాదేవి చేసిన విజ్ఞప్తిపై ఇటీవలే సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, మణిపూర్ చీఫ్ సెక్రటరీని వివరణ ఇవ్వాలని ఆదేశించింది.  దీనిపై సోమవారం విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు.. ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. కాగా, ప్రభుత్వం నుంచి తమకు హాని ఉందని మృతుడు రోజర్‌ కుటుంబసభ్యులు ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం కేంద్రం, మణిపూర్‌ ప్రభుత్వాలకు నోటీసులు జారీచేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: