ఎడిటోరియల్: ఎవరెవరు పార్టీ నుండి వెళ్ళిపోతారు? ఇంకెవరు పోనున్నారు? టిడిపి ముందున్న ప్రధాన ప్రశ్న


ఐవైఆర్ క్రిష్ణారావు చాలా సౌమ్యుడు. ఐఏఎస్ కావటం, స్వతహాగా విఙ్జుడై ఉండటం, అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ప్రగతి పథాన క్రమంగా విద్యా విఙ్జత సాంప్రదాయాన్ని అనుసరించి ఎదిగిన వ్యక్తి. ఈ కలుషిత రాజకీయాలు అదీ అసభ్య, అరాచక, అవినీతి, కళంకిత రాజకీయ నాయకుల చెండాలపు చేష్టలతో నాలుగు దశాబ్ధాలుగా సివిల్ సర్వీసులో విసిగిపొయి ఉండటంతో కొంత స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నవారు, అమరావతి రొచ్చు రాజకీయాల్లో ఇమడటం కష్టమే. ఉద్యోగ జీవితములో ఈ మురుగు రాజకీయనాయకుల సాహచర్యం తప్పని పరిస్థితిలో ఆ దౌర్భాగ్యాన్ని, రాజకీయాలని తప్పని సరై, ఉద్యోగములో అణచివేతకు సతమతమై, దాన్ని భరించిన వ్యక్తికి ఉద్యోగ విరమణ ఒక గొప్ప వరం అవుతుంది.  


ఆ తరవాతైనా స్వతంత్రంగా నిజాయతీగా, సాంఘికసేవ, తనకు నచ్చిన సమాజిక సేవలోనో పనిచేసే అవకాశం లభిస్తే సంతొషించి ఉండవచ్చు. ప్రభుత్వ సహకారానికి తన అనుభవం జోడించి నేర్పుగా తన సమాజాన్ని బాగుచేయాలని కోరికతో బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌  గా బాధ్యతను తీసుకొని ఏదో చేద్ధాం అనుకొని ఉన్నట్లు అర్ధమౌతుంది. అయితే ప్రస్తుత రాజకీయ పాలనలో అధికార పార్టీ నాయకుల కాళ్ళకు మడుగులొత్తే వారే రాణిస్థారు. కొంచెం సునిసిత, విశ్లేషనాత్మక, పరిశీలనాత్మక, సృజనాత్మకత భావాలు ఉన్న వ్యక్తులు ఎందుకూ కొరగారు.


కొన్ని నియమిత పద్దతుల ప్రకారం, రాజకీయాలకు అతీతంగా పనిచేసే వాళ్ళను ప్రతిదీ ఓటు బ్యాంక్ కోసమే చూసే నాయకత్వాలు ఆ పదవిలో సుదీర్ఘ కాలం ఉందనిచ్చే ప్రశక్తే  ఉండదు. పదవి నుండి తొలగించటానికి ఒక సాకు ప్రభుత్వానికి కావాలి. అదే  “ఫేస్‌-బుక్‌ పోస్టింగ్‌లు”. దాన్నే  కారణంగా చూపుతున్నారు. ఇంత గందరగోళం చెయ్యకుండానే ముఖ్యమంత్రి లేదా ఆయన కార్యా లయం కాని ఆయనతో  మాట్లాడి  “మీకూ మాకు పొసగదు దయచేసి మీరు తప్పుకుంటే మంచిదని చెపితే, ఈ రాజకీయ రొంపినుండి బయట పడే అవకాశం యిచ్చినందుకు  కృతఙ్జతలు చెప్పి మారీ  ఆరోగ్య, వ్యక్తిగత కారణాలెవో చూపుతూ దర్జాగా  రాజీనామా  చేసేవారు.


ఇప్పుడంతా  గెలకటం వలన బ్రాహ్మణ సమాజం మొత్తం గంపగుత్తగా టిడిపికి వ్యతిరేఖం అయ్యే సూచనలు కనిపిస్తు న్నాయి. "కోతి పుండు బ్రహ్మ రాక్షసి స్వభావం సంతరించుకుంది"  ఐవైఆర్ ఒక ఐయ్యేఎస్ అధికారిగా విశ్రాంత ఉద్యోగి. టిడిపి కోరుకున్నట్లు ఆయన ఆ పార్టీకి బ్రాహ్మణ ఓట్లను గంపగుత్తగా రాబట్టగలడు. అంతటి అనుభవఙ్జుణ్ణి డీల్ చేసే పద్దతికూడా తెలియదా అధి నాయకత్వానికి అనిపిస్తుంది. చాలా తేలికైన పని "గోరుతో పోయేదానికి గొడ్డలి వాడటం" జరిగి పోయింది. ఒకసారి ఆయన అడిగి నందుకైనా అపాయింట్మెంట్ యిస్తేనే 95% సమస్యలు పరిష్కా రమై ఉండేవి. అలాచేయక పోవటమే బ్రహ్మణ సమాజానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం పదవీ విరమణ వయసు తగ్గించి చేసిన అప కారాన్ని, గ్రామాధికారులను తొలగించిన విధం, అర్చక సమాజాన్ని చిదిమిన విధం ఇవన్నీ వారి పెద్దలు వారికి గుర్తుచేయటం ఇప్పటికే మొదలైంది.

 

అమరావతి లో రహదారుల విస్థరణతో కూల్చివేసిన దేవాలయాల  అనుభవం అనుభూతి  వారి కళ్ళలో "దృశ్యాల సమాహారం కదులుతున్నట్లు కనిపిస్తుందట" ప్రతిపక్షానికో మరో విపక్షానికో 4% ఓట్లు కదలిపోయాయనటం లో ఏమాత్రం సందేహం గాని అనుమానం గాని లేదు. ఒక నలుగురు బ్రహ్మణులతో ఐవైఆర్ ను తిట్టిస్తే టిడిపి అధినేతలు చేసే డ్రామాలుగానే ప్రజలు భావించటం అన్నీ చోట్లా ప్రారంబమైంది ఇప్పటికే.


అసలు అధికార పార్టీని ఆ పార్టీలో ఉన్నవారే ప్రశ్నించటం ఎంతో ప్రయోజనకరం. మావాళ్ళే ఎత్తి చూపారుగా? సరిచేసుకుంటాం, అని చెప్పొచ్చు. వేరే వాళ్ళు తిడితే అదొక చైన్ రియాక్షన్. అది కొనసాగుతూ ఉంటుంది జీడిపాకం లాగా... పొలిటికల్ పంచ్ రవికిరణ్ ను గెలకటంతో ఆయనకు ఆ పొలిటికల్ పంచ్ కూ విపరీత ప్రజాదరణ. ఎన్నికల సమయంలో అది విశ్వరూపం దాల్చటం ఖాయం. సోషల్ మీడియాలో ఇప్పటికే స్పందన రెట్టింపైంది. ఎందుకు టిడిపి భస్మాసురుని అవతారం ఎత్తిందో అర్ధంకాదు. 


రాజకీయ వ్యంగ్య చిత్రాలు, వ్యంగ్య వ్యాఖ్యలూ ఇవి ఒకదాన్ని కదిలిస్తే ఇంకోటి రగులుతుంది. ఏపి లో ఆపితే తెలంగాణ లో పుట్టడా! అవి నా సృజనాతమక భావావేశం. నా మనసులో భావాన్ని మీరెలా అదుపుచేయగలరు. ప్రభుత్వంలో భాగమయిన బ్రాహ్మణ కార్పొరేషన్‌కు చైర్మాన్ సొంత అభిప్రాయాలు కలిగి ఉండ కూడద ని రాజ్యాంగములో నిబంధనేమైనా ఉందా! అలా ఉంటే సుబ్రమణ్య స్వామి సంగతేమిటి.


కాంగ్రేస్ లో ఉన్న వ్యక్తి స్వాతంత్రం సంగతేమిటి. మేము జీతం ఇస్తున్నాం కాబట్టి మా మాతే వినాలనేది రాజ్యాంగం నిర్వచించలేదు కదా! ఇక్కడ ప్రత్యేకించి ఐవైఆర్ కృష్ణారావు బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌గా ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోవడం లేదని అన్నారు. ఒకవేళ తీసుకున్నా అది ముఖ్యమంత్రి స్వంత సంస్థల నుండిగాని, తెలుగు దేశం పార్టీ ఫండ్ నుండి ఇస్తున్నది మాత్రం కాదు కదా! ప్రజల సంపద వారు పన్నుల రూపంలో కట్టిన డబ్బు అన్న విషయం ఎవరూ ఏనాయకుడు మరిచిపోకూడదు. అసలు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడకూడదు అన్న నిబంధన ఏమయినా రాజ్యాంగ నిర్ణయమా? అలాంటిది ఉంటే, భావవ్యక్తీకరణ ఉన్న ప్రజాస్వామ్యంలో బ్రతుకుతున్నం కాబట్టి దాన్ని తక్షణం రద్దు చేయ్యాలి.

 

అలా అయితే రాజ్యాంగములో పొందుపరచిన వాటినన్నింటిని అనుసరిస్తున్నామా? అమలుచేస్తున్నామా? ఇప్పటికైనా ప్రభుత్వాలు నిరంకుశ పద్దతులకు తక్షణం వీడ్కోలు పలకకపోతే రానున్న ఎన్నికల్లో విపక్షాలకు అస్త్ర, శస్త్రాలను అందించి మన నెత్తిన మనమే భస్మాసురహస్తం పెట్టుకోవటమే.


వివిధ సామాజిక వర్గాల మనోభావాలను ఆయన ఎట్లా గాయపరుస్తున్నారో రిజర్వేషన్‌లు అమలు పరుస్థానని కాపుల కిచ్చిన వాగ్ధానం  నేరవేర్చకపోగా ఆ కాపునాయకుణ్ణి వేదనకు గురిచేసినతీరు ఇప్పుడు ఐవైఆర్ ను అవమానించటంతో అటు కాపుల ఇటు బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతిన్నాయి.  ఉద్యమం చేస్తున్న కాపు కులస్తుల ఉద్యమనేత, సీనియర్‌ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం పట్లా, ఆయన కుటుంబం పట్లా, అలాగే ఐవైఆర్ పట్లా దారుణంగా వ్యవహరించటంతో తెలుగుదేశం "పనితనం విభజించి పాలించు" అన్నతీరని తెలుస్తూనే ఉంది. 


జెసి దివాకరరెడ్డి తప్పు చేసినా ఆయన బలమైన సామాజిక వర్గానికి చెందటం ఆ వర్గం అంటెనే భయపడే ప్రభుత్వానికి జేసిని తట్టుకోవటం చాలా కష్టమని వదిలేశారంటున్నారు. అదే ప్రజల్లో బలపడితే సామాజిక సమీకరణాలు చాప క్రింద నీరులా మారిపోయవటం తధ్యం.  చివరకు "పురిట్లోనే సంధి కొట్టటం" అంటే ఏమిటో తెలియ జెబుతుంది. కావాలంటే ఉత్తరాది సైకిల్ పార్టీ కీళ్ళు జనం విరిచిన తీరు అఖిలేశ్ ను అడిగితే చెపుతాడు... అర్థమవుతుంది.




రోజూ ఈనాడు ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు, టివిలను చదివి చూసే వారంతా ప్రభుత్వానికి అనుకూలమో ప్రతికూలమో అనికాదు చూడాల్సింది.   అసలు వీరు ఏం  ఆలోచిస్తూ "తటస్థ అభిప్రాయాలు" సిద్ధం చేసుకొని ఎన్నికల్లో ఎలా దుష్టదుర్యోధన దుశ్శాసనులను నిర్జించాలనేదే ప్రయత్నంగా భావించాలి. జగన్ చేసిన నేరాలనుచూపి తప్పించు కోవటం లోనే  మూడు సంవత్సరాల కాలం కరిగిపోయింది. మీరేం వాగ్ధానాలు చేశారో?  వేటిని నెరవేర్చారో? చెప్పటానికి ఇంకా రెండు సంవత్సరాలే మిగిలుంది. 


ప్రశ్నించి సాధిస్తానన్న చేగువేరా ప్రియమిత్రుడు ఎక్కడో కథానాయికలతో డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు.  ఇక మనకేమీ చేయలేడని ఋజువైంది. "ఏవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడటం ప్రజలు మానేసారు. ఎన్నికల్లో ఓటు చరణాకోలాను వినియోగించబోతున్నారు. ఇక్కడ బోండా, నాని, చింతమనేని, బుద్ధా, పరకాల,  జేసిల మాటలకు అంతిమ సంస్కారం చేసి విఙ్జులను దరిచేర్చుకొంటే మాత్రమే టిడిపి బ్రతికి బట్ట కట్టుతుంది. కాపులు, బ్రహ్మణులు 90% వెళ్ళిపోయినట్లే.    ఇంకెంత కాలం ఈ కులగజ్జిని ఆశ్రయిద్ధాం?  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: