కెనడాలో కూడా మొదలైన జాత్యాంహకర పరిస్థితులు


విదేశాల్లో జాత్యాంహకర దాడులు రోజురోజుకీ హెచ్చుమీరుతున్నాయి. తాజాగా కెనడా లోని ఒంటారియో ప్రొవిన్స్ లోని ఆసుపత్రిలో ఒక మహిళ తన కొడుకుకి వైద్యం చేసేందుకు తెల్లగా ఉండే వైద్యుడే కావాలి అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తూ గోల చేసింది. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న వ్యక్తి వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా, అది వైరల్‌గా మారింది.

 

ఒంటారియోకు చెందిన ఆ మహిళ అస్వస్థతకు గురైన తన కొడుకును హాస్పిటల్‌కు తీసుకొచ్చారు. తన కొడుకుని చూయించేందుకు తెల్లగా ఉండే వైద్యుడే కావాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఆ హాస్పిటల్‌లో ఉన్న శిశువైద్యుడు సాయంత్రం నాలుగు గంటల తర్వాత వెళ్లిపోతారని, మళ్లీ మరుసటి రోజే వస్తారని ఆసుపత్రి సిబ్బంది ఎంతచెప్పినా ఆమె వినిపించు కోకపోగా పెద్ద పెద్ద కేకలు వేశారు. 

 

"దేవుడా! ఇటువంటి భయంకరమైన దేశంలోనేనా నేను నివసిస్తుంది" అంటూ ఆమె నల్లజాతీయుల గురించి వివాదాస్పదంగా మాట్లాడారు. ఆమె మాటలకు ఆసుపత్రిలో ఉన్నవాళ్లు అభ్యంతరం చెప్పారు. "మీరంతా గోధుమ రంగు వాళ్లు. మీరందరూ మాపై దాడి చేస్తారు, ఎందుకంటే నేను తెల్లగా ఉంటాను కనుక" అంటూ ఆమె కేకలు వేస్తూ ఆందోళన చేస్తున్న వారిపై విరుచుకుపడ్డారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: