మాది విడదీయలేని స్నేహం




రాజకీయాలు ఇతర బేదాభిప్రాయాలు పక్కన పెట్టి ఇద్దరు మిత్రులు ఒక్కటయ్యారు. ఇఫ్తార్‌ విందు చేసుకుని శుభ సంకేతా లిచ్చారు. రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు విషయంలో ఎవరికి వారే అన్న చందంగా వ్యవహరించిన మిత్రద్వయం నితీశ్‌ కుమార్‌, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు ఒకే వేదికపై చేరారు. ఢిల్లీలో పరస్పరం విడివిడిగా విడిపోయి ఉన్నా ఉన్నా, బిహార్‌ పాట్న విషయం లో మాత్రం కలసిమెలిసి కలివిడిగానే ఉంటామని ప్రకటించారు.


శుక్రవారం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నివాసంలో జరిగిన ఇఫ్తార్‌ విందుకు బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో జేడీయూ-ఆర్జేడీల మహా కూటమికి ఢోకాలేదని స్పష్టం చేశారు.


రాష్ట్రపతి ఎన్నికల్లో నితీశ్‌ కుమార్‌ (జేడీయూ), ఎన్.డి.ఏ అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు తెలపగా, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ (ఆర్జేడీ) మాత్రం మీరాకుమార్‌కు జై కొట్టిన సంగతి తెలిసిందే. అందరికంటే ముందు రామ్‌నాథ్‌  కోవింద్‌కు మద్దతు తెలిపిన నితీశ్‌ కుమార్‌, చరిత్రాత్మక తప్పిదమని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ వ్యాఖ్యానించడంతో రాజకీయ దుమారం చెలరేగింది. 


నితీశ్‌, మహాకూటమి నుంచి బయటికి వచ్చేసి, బీజేపీ మద్దతుతో ప్రభుత్వన్ని నడుపుతారనే చర్చనడిచింది. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుటుంబం పై ఈడీ దాడులు కూడా అందులో భాగమేనని విమర్శలు వినిపించాయి. కానీ నేటి కలయికతో మేం ఒక్కటేనని చాటుకున్నారా నేతలు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: