వత్తిళ్ళు పేరగటంతో పోలీసుల ఆత్మహత్యలు




అధికార పార్టీ నాయకుల వైఖరితో ఒత్తిళ్లకు లోనవుతున్న పోలీసు అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేసీఆర్‌ నియోజకవర్గంలో పోలీసులపై ఒత్తిళ్లు ఎక్కువ య్యాయని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆరోపించారు. పోలీసుల ఆత్మహత్య లను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సీఎంను విమర్శించే కాంగ్రెస్‌ నేతలపై పలు కేసులు పెడుతున్నారని ఆయన చెప్పారు. పోలీసుల ఆత్మహత్యలపై న్యాయ విచారణ జరపాలని ఆయన అన్నారు. భూకుంభకోణాలపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.




ఎస్ ఐ  ప్రభాకర్ రెడ్డి తర్వాత అతని సంబంధీకులు శాంతియుతంగా ధర్నా చేస్తే పోలీసులు వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించా రని ఆరోపించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమర్జన్సీ కొనసాగుతుందని విమర్శించారు. తెలంగాణలో ఏ రకమైన పరిపాలన కొనసాగుతుందో గజ్వేల్ నియోజకవర్గం చూస్తే అర్థమవుతుందన్నారు.



కుకునూర్ పల్లి ఎస్సైలు ప్రభాకర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి  మరణాలపై న్యాయ విచారణ జరిపించి, సీఎం తన చిత్త శుద్దిని నిరూపించు కోవాలని డిమాండ్ చేశారు. శిరీష మరణానికి ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యతో ముడిపెట్టడం సమంజసం కాదన్నారు. మియాపూర్ భూ కుంభకోణంలో సీబీఐ విచారణ జరిపించకుంటే  టీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపినట్లే భావించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. సీఎం రక్తంలో అణువణువూ రాచరిక పోకడలే ఉన్నాయని, నియంతపాలన సాగిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: