'అన్న వస్తున్నాడు' నినాదంతో ప్రజల్లోకి జగన్.. టీడీపీ లో మొదలైన కలవరం...!

Shyam Rao

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేపట్టాలని తహతాహలాడుతున్న జగన్ ఆ దిశగా ప్రణాళికలను రచిస్తున్నారు. అన్న వస్తున్నాడు అనే నినాదాన్ని వైఎస్సార్సీపీ పార్టీ ప్లీనరీ సమావేశంలో నినదించిన జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ తండ్రి వైఎస్ఆర్ 2004 లో బాబు ప్రభుత్వాన్ని పాదయాత్ర ద్వారా ఎలా కులగోట్టారో సరిగ్గా అలాగే జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి బాబు ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో చెక్ పెట్టాలని చూస్తున్నారు. అందులో భాగంగానే ముందున్నాయ్ మంచిరోజులు కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.



జగన్ రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాల చిట్టాను ముందే విడుదల చేశారు. అయితే జగన్ ప్లీనరీ సభకు, ప్రకటించిన పథకాలకు ప్రజల్లో కాస్త స్పందన రాగానే.. పచ్చ పార్టీ నేతల్లో భయం పట్టుకుందో ఏమో గానీ నేతలంతా కూడా ఒక్కొక్కరిగా జగన్ పై విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారు. వీటన్నింటినీ చూస్తుంటే అధికార ప్రతిపక్ష నేతల్లో ఇప్పుడే ఎన్నికల హడావుడి మొదలైందా..? అన్నట్టుగా అనిపించక మానదు.



జగన్ అధికారంలోకి వస్తే వీధికో రౌడీ తయారవుతాడని ఒక నాయకుడంటే.. జగన్ ప్లీనరీ సభ విజయవంతం అవడంతో పచ్చ పార్టీ నేతల్లో భయం మొదలైందని మరో నేత అంటున్నారు. ఇలా ఒకరిపై ఒకరు వామర్శనాస్త్రాలు సంధించుకుంటూనే ఉన్నారు. ఏది ఏమైనా ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో ఎవరి వ్యుహాల్లో వారు ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలో అంతిమ నిర్ణయం ప్రజలదే కాబట్టి.. ప్రజలంతా ఏ పార్టీవైపు మొగ్గు చూపుతారో ఏ పార్టీకి పట్టం కడతారో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: