రాష్ట్రపతి ఎన్నికలు: మమతా బెనెర్జీకి షాక్





ప్రధాని మోడీని తీవ్రంగా తీవ్ర స్వరంతో సర్వత్రా వ్యతిరేకించే పశ్చిమ బన్గ ముఖ్య మంత్రి మమతా బెనర్జీకి తన స్వంత పార్టీ ప్రజా ప్రతినిధుల నుంచే ఎవరూ ఊహించని షాక్ తగిలింది. రాష్ట్రపతి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అభ్యర్థి మీరాకుమార్ కు మద్దతివ్వగా తాజాగా ఈ రోజు జరుగుతున్న పోలింగ్ లో మాత్రం ఆమెకు గట్టి షాకే తగిలింది. తృణమూల్ ప్రజా ప్రతినిధుల్లో కొందరు ఎన్డీయే అభ్యర్థి రాం-నాథ్ కోవింద్ కు ఓటు వేయడంతో ఆమె పరువు హుబ్లీ గంగలో లో కలసి పోయినట్లయింది.



    
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కు చెందిన కొందరు తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ నిర్ణయాన్ని కాదని ఎన్డీయే పార్టీ అభ్యర్ధి రామ్ నాథ్ కోవింద్ కు ఓటు వేసినట్టుగా తెలుస్తోంది. ఒక ఎంపీ, ఆరుగురు పశ్చిమ బంగా ఎమ్మెల్యే లు తమ అధినేత్రి మద్దతిస్తున్న కాంగ్రేస్ అభ్యర్ధి మీరా కుమార్ ను త్రోసిపుచ్చి ఎండిఏ అభ్యర్ధి రాం-నాథ్ కోవింద్ కు ఓటువేసి ఆ విషయాన్ని బయటకు వచ్చి చెప్పారు. దీంతో మమత వారిపై మండిపడుతున్నారు.  



    
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన అభ్యర్ధి మీరాకుమార్ కు మద్దతు పలికిన మమతా బెనర్జీ - తన పార్టీ ప్రజా ప్రతినిధులంతా ఆమెకే ఓటు వేయాలని చెప్పినా వీరు ఆ ఆదేశాలు ఖాతర్ చేయకుండా ఉల్లంఘించి మరీ రాం నాథ్ కోవింద్ కు ఓటేసినట్లు తెలుస్తోంది.
    
అయితే, రహస్య బ్యాలట్ పద్ధతిలో జరిగిన ఓటింగ్ కారణంగా పార్టీలు "విప్ జారీ చేయడానికి వీల్లేకుండా" చేశారు. దీంతో "విప్ ఉల్లంఘన" అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాలేదు కాబట్టి వీరిపై చర్యలు ఎలా ఉంటాయో చూడాలి. మహా అయితే పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అధినేత్రి అంతదూరం పోతుందా? అన్నది ప్రశ్నార్ధకమే? 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: