పాకిస్థాన్ మీడియా ప్రసారాలను ఖండించిన చైనా అధికార మీడియా

భారత పాకిస్తాన్ సరిహద్దు పొడవునా 158 మంది భారత సైనికులు చైనా రాకెట్ దాడిలో మరణించారని రాసిన రాతలన్నీ అబద్ధాలేనని వాటికి ఎలాంటి ఆధారాలు లేవని అది పాకిస్తాన్ మీడియా విషప్రచారమేనని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి గోపాల్ బాగ్లే ప్రకటించారు. 




పాకిస్తాన్ 24 గంటల వార్తా సేవల చానల్ "దునియా న్యూస్" అనే ఉర్దూ భాషా చానల్ ప్రకటించిన వార్తలకు దీనికి ఒక రోజు ఆలస్యంగా చైనా ప్రధాన అధికార వార్తా స్రవంతి "పీపుల్స్ డైలీ" స్పందిస్తూ "పాకిస్తాన్ మీడియా 158 భారత సైనికులు చైనా రాకెట్ దాడిలో మరణించారన్న రాతలకు ఎలాంటి ఆధారం లేదని ఆ వ్యాఖ్యలు అర్ధ రహితమని" వెలువరిస్తూ, పాక్ మీడియా రాతలను నిర్ద్వందంగా ఖండించింది. 




చైనా పీపుల్స్ డైలీ మంగళవారం ప్రచురించిన పరిశోదనాత్మక నివేదిక ప్రకారం "భారత్ లోని చైనా రాయబార కార్యాలయం పాకిస్తాన్ ఉర్దూ భాషా చానల్ దునియా న్యూస్ ద్వారా ప్రచారమైన వార్తలను గుర్తించింది. వెంటనే ఆ వార్తలను నిర్ద్వందంగా త్రోసిపుచ్చింది. సామాజిక మీడియాలో వైరల్ అయివచ్చిన కొన్ని నకిలీ వార్తలను (ఫేక్ న్యూస్) పాకిస్తాన్ మీడియా దృవపరచు కోకుండా కనీసం పరిశీలించ కుండా నిజాన్ని గుర్తించకుండా ప్రచారం చేయటం దురదృష్టకరమని" వ్యాఖ్యానించింది. మొత్తం దునియా న్యూస్ ను ఖండించింది.





"గ్లోబల్ టైంస్" పాకిస్తాన్ చానల్ ప్రసారం చేసిన చిత్రాలన్నీ కాస్మీర్ సరిహద్దులోని సంఘ్ర్షణకు చెందినవని, దునియా న్యూస్ కు ఎలాంటి ఆధారాలు లేని నకిలీ వారతలని చెప్పింది. భాత చైనా దళాలు ఒక నెల రోజుల నుండి ఉన్నచోటనే నిలకడగానే ఉన్నాయని ఎలాంటి కాల్పులు ఇరుపక్షాలనుండి జరగలేదని వివరించింది. 


భారత్ సేనలను దోంగ్లాంగ్ (డోక్లా) ప్రాంతం నుండి వైదొలగాలని మాత్రమే కోరటం జరిగింది తరవాతనే చర్చలకు అస్కార ముంటుందని తెలిపినట్లు చైనా వార్తా సంస్థలు ప్రకటించాయి. ఆ ప్రాంతం లో చైనా సైన్యం నిర్మించే రహదారి పనులను భారత్ సేనలు అడ్డుకోవటం తప్పని తక్షణమే తప్పుకోవాలని కోరుతున్నట్లు తెలుస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: