కొత్త నియోజ‌క‌వ‌ర్గం బ‌రిలో సీఎం కేసీఆర్‌..!

VUYYURU SUBHASH
రెండు తెలుగు రాష్ట్రాల్లోను ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ఉన్న 119 నియోజ‌క‌వర్గాలు 153 కానుండ‌డంతో అన్ని పార్టీల నుంచి ఆశావాహులు త‌మ‌కూ ఓ ఎమ్మెల్యే సీటు రాదా ?  తాము ఎమ్మెల్యేలు అయిపోమా ? అన్న ఆశ‌ల‌తో ఉన్నారు. ఏపీలోను, తెలంగాణ‌లోను చాలా మంది మంత్రులు, సీనియ‌ర్ ఎమ్మెల్యేలు నియోజ‌క‌వ‌ర్గాలు మారేందుకు ఇప్ప‌టి నుంచే ర‌క‌ర‌కాల ప్లాన్లుతో ఉన్నారు.


ఇదిలా ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కొత్త నియోజ‌క‌వ‌ర్గంపై క‌న్నేసిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఆయ‌న గ‌జ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. గ‌తంలో కేసీఆర్ సిద్ధిపేట నుంచి ప‌లుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు గ‌జ్వేల్‌కు మారారు. ఇక కేసీఆర్ ఎంపీగా మెద‌క్‌, క‌రీంన‌గ‌ర్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి గెలిచారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గ‌జ్వేల్ కంటే ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్ర‌మైన యాదాద్రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసేందుకు ఆస‌క్తితో ఉన్న‌ట్టు టీఆర్ఎస్ వ‌ర్గాల్లో ఇంటర్న‌ల్ ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్ర‌స్తుతం ఉన్న భువ‌న‌గిరి నియోజ‌క‌వ‌ర్గం రెండుగా చీలి కొత్త‌గా యాదాద్రి నియోజ‌క‌వ‌ర్గం రానుంది. ఇక ఇప్ప‌టికే యాదాద్రి జిల్లా కేంద్ర‌మైన సంగ‌తి తెలిసిందే. ఇక ఇప్పుడు యాదాద్రి నియోజ‌క‌వ‌ర్గంగా కూడా మారుతుండ‌డంతో కేసీఆర్ ఇక్క‌డ నుంచే పోటీ చేసేందుకు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. 
2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచే యాదాద్రిలో టీఆర్ఎస్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటూ వ‌స్తోంది.

2001లోనే టీఆర్ఎస్ ఇక్క‌డ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు ఈ పుణ్య‌క్షేత్రాన్ని తెలంగాణ‌లోనే తిరుప‌తి త‌ర‌హా పుణ్య‌క్షేత్రంగా మార్చేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న క‌న్ను కూడా ఇదే నియోజ‌క‌వ‌ర్గంపై ప‌డిన‌ట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: