హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..28 మంది మృతి..!

Edari Rama Krishna
భారత దేశంలో రోజూ రోజుకీ రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  రోడ్డు రవాణా సంస్థ ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వచ్చినా..కొంత మంది నిర్లక్ష్యం..కొన్ని అనుకోని సంఘటనల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.  తాజాగా హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.  ఓ ప్రైవేటు బస్సు ఇరుకైన దారిలో ప్రయాణిస్తూ, లోయలో పడిపోయిన ఘోర దుర్ఘటనలో 28 మంది మరణించారు.

కిన్నార్ నుంచి సోలన్ వెళుతున్న బస్సు షిమ్లాకు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖన్ తేరీ వద్ద అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. సిమ్లా డిప్యూటీ కమిషనర్ రోహన్ చంద్ ఠాకూర్ బస్సు ప్రమాదాన్ని అధికారికంగా ప్రకటించారు.

విషయం తెలుసుకున్న రెస్క్యూ టీములు రామ్ పూర్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టాయి. బస్సులో నుంచి మృతదేహాలను వెలికితీసిన అధికారులు, గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: