వీడిన హైందవీ మిస్టరీ కేసు.. అక్కా.. అక్కా అంటూనే...!!

Shyam Rao

పాశ్చాత్య నాగరికత ప్రభావమో, సినిమాల ప్రభావమో, మత్తు మందు ప్రభావమో తెలియదు గానీ ఈ మూడింటి ప్రభావం వల్ల యువత పెడదారి పడుతున్నారనే విషయం మాత్రం వాస్తవం. సభ్య సమాజం ఆధునిక పోకడలు తొక్కుతున్నా మనుషుల అలవాట్లు, ఆలోచనలు కూడా వికృత పోకడలు తొక్కుతున్నాయి. దీనికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ సంఘటన. ఒక ఇంట్లో అద్దెకు ఉండడానికి అనుమతించిన విద్యార్ధి ఆ యజమాని కూతురుని అక్కా అక్కా అంటునీ ఆమెపై అత్యాచారం చేయబోయాడు. అయితే దీనికి ఆమె ప్రతిఘటించడంతో ఈ విషయం బయటకు పోక్కుతుందని ఆమెను మట్టుబెట్టాడు. కడప జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన.  కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో శుక్రవారం సంచలనం రేపిన హైందవి(23) హత్యకేసులో నిందితుడైన నవీన్‌ కుమార్‌ను సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



అతడు దొంగిలించిన బంగారు ఆభరణాలు, వాహనాన్నీ స్వాధీనం చేసుకున్నారు. నవీన్ కుమార్ కు అతని స్నేహితుడు నరహరి ఫోన్ చేసి తన గర్ల్ ఫ్రెండ్ తో ఏకాంతంగా గడపడానికి రూమ్ కీవాలని అడగడంతో తన రూమ్ వాడుకోమని సలహా ఇచ్చి వారికి తన రూమ్ అప్పగించిన నవీన్ నరహరి బైక్ తీసుకొని బయటకు వెళ్దామని కొంత దూరం వెళ్లడంతో బైక్ లో పెట్రోల్ అయిపోవడంతో అదే సమయంలో బయటకి వెళ్లిన ఇంటి యజమాని కూతురు హిందవి స్కూటీ పై వస్తూ అతని రాకను గమనించడంతో అతనిని స్కూటీపై ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చి వెళ్లి పెట్రోల్ తెచ్చుకోమని సలహా ఇవ్వడంతో నవీన్ హైందవి స్కూటీ పై వెళ్లి పెట్రోల్ తెచ్చుకొని స్కూటీ తాళాలు ఇవ్వడానికి ఇంట్లోకి వెళ్లాడు. 



అక్కా మంచి నీళ్లు ఇవ్వాలని అడిగాడు. ఆమె మంచినీళ్లతో పాటు స్వీటు కూడా ఇచ్చింది. అనంతరం బెడ్‌రూంలో ఒంటరిగా ఉన్న హైందవితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమె ప్రతిఘటించడంతో మద్యం మత్తులో ఉన్న అతను ఆమె గొంతు నులిమేశాడు. బాత్రూంలోకి తీసుకెళ్లి కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న చెవి దుద్దులు, బంగా రు చైన్‌, సెల్‌ఫోన్‌, స్కూటీ తీసుకుని పరారయ్యాడు.  ఈ ఘ‌ట‌న‌లో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఎట్ట‌కేల‌కు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గతంలో హైందవి ఇంట్లో అద్దెకు ఉన్న నవీన్‌ అనే యువకుడే ఆమెను హ‌త్య చేశాడ‌ని చెప్పారు. మృతురాలు హైందవి మొబైల్‌ ఫోన్‌ కాల్స్‌ ఆధారంగా ఈ కేసును ఛేదించామ‌ని తెలిపారు. హైందవి ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని నవీన్ గుర్తించి, నిన్న ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారయత్నం చేశాడ‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: